
అయితే ఇప్పుడు ఈ కలహం అనేది మరో కీలకమైన మలుపు తిరిగినట్లుగా తెలుస్తుంది. అదేంటంటే రష్యా సైన్యానికి సంబంధించిన మాజీ సైనికాధికారితో పాటుగా ప్రస్తుత సైనిక అధికారి ఇప్పుడు వ్యాగనార్ గ్రూపు పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఆరోపణలు ఎంత నిజమో తెలియదు గాని అవి మాత్రం ఇప్పుడు అక్కడ సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి.
అసలు ఇంతకీ వాళ్లు ఏ ఆరోపణ చేస్తున్నారంటే యుద్ధంలో తమ ప్రత్యర్థి అయిన ఉక్రెయిన్ కి సహాయం చేస్తుందని అంటున్నారట. రష్యా కు సహాయం చేస్తున్నట్లు చేస్తూ, ఉక్రెయిన్ కి ఇక్కడ యుద్ద ప్రణాళికలన్నీ లీక్ చేస్తుందని అంటున్నారట. దానికి ఉదాహరణగా వాళ్ళు చెప్పే సంఘటన ఏమిటంటే, వాళ్లు ఉక్రెయిన్ కి సంబంధించిన బాగ్పుత్ పై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ సైన్యం వాళ్లకు ఎదురు వచ్చి మరి దాడి చేశారట.
అసలు బాగ్పుత్ పై దాడి చేయాలనే ప్లాన్ రష్యా దేశపు అధ్యక్షుడికి, ఇంకా వ్యాగనార్ గ్రూపు అధ్యక్షుడికి వీళ్ళ ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం. అయితే రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ అయితే తమ దేశ పతనాన్ని కోరుకోరు ఇలాంటి రహస్యాలు చెప్పడం ద్వారా. ఇక మిగిలింది వ్యాగనార్ గ్రూప్ మాత్రమే. వ్యాగనార్ గ్రూపు మాత్రమే చెప్పే అవకాశం ఉంది. అసలు వ్యాగనార్ గ్రూపుకి మేము ఎందుకు సమాచారం అందించామంటే మేము బాగ్పుత్ వెళ్ళాక వ్యాగనార్ గ్రూపు రిట్రీట్ అవాల్సి ఉంది కాబట్టి అని. రష్యా శత్రువులతో సంబంధం పెట్టుకుని అది రష్యాపై కుట్ర చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు.