మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా విలేకరుల సమావేశంలో కీలక సూచనలు చేశారు. అయితే అప్పటికే 45 మంది ఉగ్రవాదులను ఆర్మీ చంపేసింది. ఏకే 47 గన్స్ తో బాంబులతో మణిపూర్ లో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టు పెట్టింది. అనంతరం అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడారు.  హైకోర్టు మాజీ విశ్రాంతి న్యాయమూర్తితో దర్యాప్తునకు చేయిస్తామని చెప్పారు. గవర్నర్ ఆధ్వర్యంలో శాంతి కమిటీలు పని చేస్తాయని చెప్పారు.


కుట్రలో ఎవరు ఉన్నా అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. హింస వెనక కుట్రలు దాగి ఉన్నాయని ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.  వాటిపై సమగ్ర దర్యాప్తు జరిపి హింసకు కారకులు ఎవరో వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎఫ్ఐఆర్ ల మీద సీబీఐ  దర్యాప్తు చేయిస్తామని అమిత్ షా వెల్లడించారు.  ప్రస్తుత సంక్షోభానికి చర్చలే పరిష్కారం అని సూచించారు. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుకి, మైత్రి సామాజిక వర్గాలతో చర్చలు జరిపమని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇతర పౌర సమాజ సంస్థలతో మాట్లాడామని అన్ని సర్దుకుంటాయని తెలిపారు.


వదంతులు నమ్మవద్దని శాంతి భద్రతల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్ ను నియమించారు. ప్రస్తుత డీజీపీ హోంశాఖకు బదిలీ చేశారు. హోంశాఖ మంత్రి పర్యటన సందర్భంగా మళ్లీ దాడులు చేయాలని ప్రయత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. కొత్త డీజీపీ నియామకం వల్ల అక్కడ పూర్తి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.  మొత్తం మీద మణిపూర్ లో మళ్లీ సాధారణ పరిస్థితులు తేవడానికి కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: