ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారం చేపట్టడానికి సహకరించింది. 1998 సంవత్సరంలో టీడీపీ లో అంతర్గత కుమ్ములాటల సమయంలో కూడా టీడీపీ పార్టీ కేంద్రంలో బీజేపీకి సహకరించింది. కానీ బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చతికిలపడింది. దీనివల్ల 1998 లో 12 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న బీజేపీ, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వెనకబడిపోయింది. టీడీపీ బలంగా తయారైంది.


ఆంధ్రప్రదేశ్ లోక్ సభ స్థానాల్లో అసలు గెలవని పరిస్థితికి బీజేపీ  చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో టీడీపీ లాభం పొందింది.  బీజేపీ మాత్రం తన ఓటు బ్యాంకును ఆంధ్రలో టీడీపీకి బదలాయించి త్యాగం చేసింది. వెంకయ్య నాయుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు. ప్రస్తుతం ఆంధ్రలో కూడా బీజేపీ తో టీడీపీ పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది.  


బీజేపీ 2004 నుంచి 2014-19 వరకు జరిగిన అన్ని సాధారణ ఎన్నికల్లో సింగిట్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమై కేవలం 10 నుంచి 15 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. కేంద్రంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఓటింగ్ శాతం దెబ్బతింటోంది. అచ్చం ఇలాగే కాంగ్రెస్, టీడీపీ లతో పొత్తులు పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా గెలవలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఎవరైనా అభిమానులు ఓటు వేయడం తప్ప వారికి గెలిచే అవకాశాలు రాష్ట్రంలో తక్కువ.


రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ పార్టీకి సంబంధించి పొత్తులపై చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో మళ్లీ బీజేపీకి సంబంధించిన ఓటర్లు పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి వేయాల్సి వస్తోంది. బీజేపీ ఓటింగ్ శాతం తగ్గి, టీడీపీకి పెరుగుతుంది. సమయం వచ్చినపుడు మీ ఓట్ల శాతం ఎంత అని మళ్లీ వారే బీజేపీని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP