
కూటమిగా వచ్చిన మూడు పార్టీలు ఒకవైపు, అధికారంలో ఉన్న వైసీపీ మరోవైపు నిలబడ్డాయి. అమీ తుమీ అంటూ.. రెండు శిబిరాలు పోట్లాడుకున్నాయి. సాధారణంగా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎంత కవరేజీ ఇవ్వాలో జాతీయ మీడియా అంతే ఇస్తుంది. కానీ, తొలిసారి ఏపీలో జరిగిన ఎన్నికలపైనా.. నాటివైసీపీ పాలనపైనా.. కూటమి పార్టీల పొత్తులపైనా జాతీయస్తాయిలో 90 గంటల పాటు.. చానెళ్లు చర్చలు పెట్టాయి. ఈ ఎన్నిక అంత ఉత్కంఠకు.. టెన్షన్‌కు కూడా గురి చేసింది.
ప్రజలకు పథకాలు ఇచ్చామని.. ప్రజలంతా తమవెంటే ఉన్నారని నాటి అధికార పార్టీ వైసీపీ చెప్పుకొనే ప్రయత్నం చేసింది. కానీ, పేదల ఇళ్లను లాగేసుకునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకువచ్చార ని.. జగన్ ఇస్తున్న పథకాలను.. తాము కూడా అమలు చేస్తామని.. చేసిన కూటమి పార్టీల ప్రచారం.. ప్రజలకు చివరి విడతలో జోరుగా చేరింది. ఫలితంగా.. ఎన్నికల సరళితోపాటు.. పోలింగ్ రిజల్ట్‌ను కూడా ఎవరూ అంచనా వేయలేని స్థితికి తీసుకువచ్చింది.
పోలింగు రిజల్ట్ వచ్చిన రోజు.. తొలి విజయం టీడీపీ ఖాతాలో పడింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక, తమదే విజయమని భావించిన వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయడంలో సర్వే సంస్థలు దాదాపు వెనుకబడ్డాయనే చెప్పాలి. ఒక్క సర్వే మాత్రమే కూటమికి భారీ స్థాయిలో స్థానాలు దక్కుతాయని చెప్పింది. మొత్తంగా చూస్తే.. ఏడాది కిందట ఇదే రోజు.. పెద్ద మార్పు.. ప్రజలకు ఓదార్పు దక్కిందని రాజకీయ వర్గాలు చెబుతాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు