క్షుద్ర పూజలు, క్షుద్ర మంత్రాలు అనే వాటికి సంబంధించిన అనేక వాదనలు ఇండియాలో ఏళ్ల తరబడి వినిపిస్తూనే ఉంటాయి. కొన్నిచోట్ల ఇప్పటికీ మంత్రాల నెపంతో హత్యలు జరుగుతున్నాయి. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో కొట్టి చంపడం, దేహశుద్ధి లాంటివి చేసే సంఘటనలు భారత్ లో కోకొల్లలు. కానీ అమెరికా లాంటి చోట్ల కూడా క్షుద్ర పూజలు చేశారని ఉరి తీసిన సంఘటనలు ఉన్నాయంటే నమ్మగలరా? అమెరికాలో క్షుద్ర పూజలు చేయడం ఏంటీ? దానికి సంబంధించి తీర్మానాలు చేయడం ఏమిటీని ఆశ్చరపోవాల్సిన పరిస్థితి వచ్చింది.


300 ఏళ్ల క్రితం క్షుద్ర పూజలు చేసిన వ్యక్తులను ఉరి తీసే చట్టం అమెరికా లో ఈ మధ్య రద్దయింది. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో క్షుద్రపూజలు చేసే వారిని ఉరి తీసే చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వారి ఉరి శిక్షను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. 12 మందిని నిర్దోషులని తెలిపింది. 11 మందికి ఉరిశిక్ష పడింది. ఇది 370 ఏళ్ల కిందట ఘటన. అమెరికా వలస వాదుల చేతుల్లో ఉన్నప్పుడు జరిగిందని తెలిపింది. అప్పట్లో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికి ఉరి శిక్ష పడి మరణించిన వారి వారసులు కోర్టుల్లో కొట్లాడుతూనే ఉన్నారట.


దీనిపై కనెక్టకట్ రాష్ట్రం క్షుద్ర విద్యలు చేస్తే ఉరి తీసే చట్టాన్ని తొలగించింది. 33-1 ఓట్ల తేడాతో దీన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1600 నుంచి క్రీ.శ 1700 మధ్య క్షుద్ర పూజల విధానం జరిగినట్లు తెలుస్తోంది. 370 ఏళ్ల కిందట జరిగిన క్షుద్ర ఘటనలపై ఇప్పుడు తీర్పు చెప్పడం ఏమిటి? ఉరి తీయడం తప్పని చెప్పడం వల్ల ఇప్పుడు ఒరగబోయేది ఏమిటని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందా? ఎందుకు ఇప్పుడు దీన్ని తెర మీదకు తెచ్చారోనని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA