
హై ప్రక్టోజ్ ఫుడ్స్..
మనం తాగే జ్యూస్ లో మరియు కాఫీలు లో ఉన్న షుగర్ ప్రక్టోజ్ రూపంలో ఉంటుంది.ఇది తొందరగా యూరిక్ యాసిడ్ని ఏర్పరచడానికి దోహదపడుతుంది.కావున అధిక యూరిక్ ఆసిడ్ ఏర్పడకుండా ఉండాలి అంటే ఈ జ్యూస్ లను కాఫీలను దూరంగా ఉంచడం చాలా మంచిది.
జంక్ ఫుడ్..
మనం తీసుకునే బ్రెడ్,బర్గర్,పాస్తా,మఫిన్లు, ప్రాసెస్ చేసిన పాలు,మాంసం వంటి జంక్ ఫుడ్ లలో ప్యూరిన్ అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి.మన శరీరంలో ఈ ప్యూరిన్ బ్రేక్ అయి,అధిక యూరిక్ యాసిడ్ ఏర్పడడానికి దోహదపడుతుంది.కావున వీలైనంత త్వరగా జంక్ ఫుడ్ ను మానివేయడం అన్ని విధాలా చాలా మంచిది.
అధిక షుగర్స్..
పిల్లలు మరియు పెద్దలు అవసరం లేని షుగర్స్ అంటే క్యాండీలు,చాక్లెట్లు,బిస్కెట్లు అంటే ఎక్కువ పంచదార వేసిన వస్తువులను తింటూ ఉంటారు.దీనివల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగి,ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది.కావున పిల్లలకు సమతుల ఆహారాన్ని తినడం అలవాటు చేయాలి.
హై ప్యాట్స్..
జీర్ణం కానీ హై శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ని అధికంగా తీసుకోవడంతో మన శరీరంలో యూరిక్ యాసిడ్ విలువలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ ఫాట్స్ ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్,బేకరీ ఐటమ్స్,అధిక ఫ్యాట్ కలిగిన మాంసం వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది.కావున వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
అధిక ఆల్కహాల్..
అధిక ఆల్కహాల్ తీసుకోవడంతో కూడా ప్యూరిన్ అనే సమ్మేళనాలు ఎక్కువగా యూరిక్ యాసిడ్ ని ఏర్పరుస్తాయి.అధిక హాల్కాహాలు తీసుకునేవారు క్రమంగా వారి అలవాటును తగ్గించుకోవడం మంచిది.
కావున పైన చెప్పిన ఆహారాలకు దూరంగా ఉండటంతో యూరిక్ యాసిడ్ విలువలు పెరగకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.