2000 నోట్ల మార్పిడి విషయంలో తాజాగా ఆర్బిఐ బ్యాంకులకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ ను ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చడంలో ఏర్పడిన లోపమో లేక అర్థం చేసుకోలేకపోవడమో మరొక లోపమో తెలియదు కానీ బ్యాంకర్లలో ఈ విషయంపై అస్పష్టత నెలకొంది. 2000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఆర్బిఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. గాని నోట్లను మార్చే విషయంలో బ్యాంకులు ఆర్బిఐ ప్రస్తుతం ఇస్తున్న గైడ్లైన్స్ను అనుసరించాలని పేర్కొంది.


ఎస్బిఐ ఇంకా పిఎన్బి నోట్ల మార్పిడి పై తమ ప్రకటనలను విడుదల చేసాయి. నోట్లను మార్చుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి దరఖాస్తులను ఐడెంటిటీ పత్రాలను ఇవ్వాల్సిన అవసరం లేదని అవి చెప్పాయట. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇలాగే ప్రకటించిందట. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి సంబంధించిన ఇంటర్నల్ సర్క్యులర్  ప్రకారం కరెన్సీ నోట్ల మార్పిడి సమయంలో గుర్తింపు పత్రాన్ని అడగొచ్చు అని ఒక అధికారి చెప్తున్నారట.


ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా డిపాజిట్లు తీసుకుంటే రేపు పొద్దున అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఎవరు మార్చుకుంటున్నారు, ఎన్నిసార్లు మార్చుకుంటున్నారు అనే విషయం క్లారిటీ లేకపోతే రేపు సదరు వ్యక్తి మనీ లాండ్రింగ్ విషయంలో పట్టుపడితే సమస్యలు వస్తాయని చెప్పుకొస్తున్నారట. అలాంటి సందర్భంలో దర్యాప్తు అధికారులు బ్యాంకు అధికారులను వేధింపులకు గురి చేస్తారని అంటున్నారు.


2000 నోట్ల మార్పు విషయంలో తాము ఎలాంటి అదనపు ప్రొసీజర్ ని ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ నిబంధన కింద 50000 కి మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ సమర్పించాలి కాబట్టి ప్రస్తుత నిబంధనలు కొనసాగుతాయని దాస్ చెప్పారు. 50,000కి మించి 2000 నోట్లు  కనుక డిపాజిట్ చేయాలనుకుంటే కనుక పాన్ ని సమర్పించాలి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: