మెగాస్టార్ సినిమాలు అంటే ఒక లెక్క ఉంటుంది. ఆ మూవీకి కొన్ని కొలతలు ఉంటాయి. మెగా స్టార్ ఆల్ రౌండర్ అని కూడా చెప్పాలి. ఆయన క్లాస్ మూవీస్ చేశారు. మాస్ మూవీస్ చేస్శారు. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా రఫ్ ఆడించేశారు.

అయితే పక్కా ఊరమాస్ మూవీస్ ని మాత్రం ఆయన పెద్దగా చేయలేదు. గోవిందుడు అందరి వాడే అన్న మూవీ కొంచెం ఆ జానర్ లో ఉన్నా మెగాస్టార్ అంతకు మించి జోరు చూపించలేదు. అయితే మెగాస్టార్ లో ఉన్న మాస్ ని పూర్తిగా బయటకు తీసి ఆడియన్స్ కి కంప్లీట్ శాటిస్ఫాక్షన్ ఇచ్చేలా డైరెక్టర్ బాబీ చూస్తున్నాడు.

ఆయన మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్న 154 సినిమా కు వర్కింగ్ టైటిల్ గా వాల్తేర్ వీరన్న గా అనఫిషియల్ గా ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు, ఈ మూవీ శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో సాగుతుందిట.

మెగాస్టార్  పోలీస్ గా నటిస్తారు. కానీ ముందంతా ఆయన పక్కా మాస్ లుక్ తో వేరేగా దర్శనమిస్తారుట. సినిమా అంతా అలాగే సాగుతుంది. విలన్ల కోసం ఇలా మాస్ గెటప్ వేసి చివరికి వారి ఆట కట్టించిన పోలీస్ ఆఫీసర్ గా మెగాస్టార్ ని  చూపించబోతున్నారు అంటున్నారు.

ఇది లీక్ అయిన స్టోరీగా చెబుతున్నారు. అయితే ఇదే నిజంగా ఉంటుందా లేదా అన్నది తెలియదు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మెగాస్టార్ ని పక్కా ఊర మాస్ రోల్ లో ప్రెజెంట్ చేయడానికే రెడీ అయ్యారని అంటున్నారు. అదే కనుక నిజమైతే చాలా కాలంగా చిరంజీవి నుంచి అలాంటి రోల్ ని కోరుకుంటున్న ఫ్యాన్స్ కి అది బ్రహ్మాండమైన ఫీస్ట్ గానే భావించాలి మరి. సో బాబీ మ్యాజిక్ కోసం అంతా చూస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: