
అసలు విషయంలోకి వస్తే ప్రాజెక్టు-k చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే అమితాబచ్చన్ కూడా నటిస్తూ ఉన్నారు. వీళ్ళు తప్పితే మిగతా నటీనటుల గురించి ఏ ఒక్క విషయం కూడా ఇప్పటివరకు వినిపించలేదు. గతంలో ఒకసారి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు దుల్కర్ సల్మాన్ ఇందులో ఉన్నాడా అని అందరూ అనుకున్నారు.కానీ అందులో నిజం లేదు ఇప్పుడు కమలహాసన్ పేరు కూడా బయటికి రావడం జరిగింది.. అలాగే ఈ సినిమాలో నటన కోసం రూ.150 కోట్లు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది అంతా ఫేక్ న్యూస్ అన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ప్రభాస్ ఈ చిత్రం కోసం కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారు అది కూడా మొత్తం యాక్ట్ చేస్తున్నందుకు ఇంతటి రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ కేవలం 20 రోజులకే కమలహాసన్ రూ.150 కోట్లు ఇస్తారంటే ఏమాత్రం నమ్మేలా కనిపించలేదు. కాబట్టి ప్రాజెక్ట్-k సినిమాలో కమలహాసన్ నటించిన కేవలం ఒక రూమర్ మాత్రమే అని చెప్పవచ్చు ఇక భారతీయుడు-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కమలహాసన్. ఇవే కాకుండా తన నిర్మాణంలో పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ తో సినిమా పైన మరి చిత్ర బృంద క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.