సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు కొన్నే ఉన్నాయి. అందులో అనిరుధ్ రవి చందర్ పేరు తప్పకుండా ఉంటుంది. సౌత్ సినిమా ఇండిస్ట్రీలో ఈ యంగ్ సెన్సేషన్ తనదైన మార్క్ పాటలతో ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆయన మ్యూజిక్ మాయజాలమే నడుస్తోంది. అసలు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా మ్యూజిక్‌ అందించే టాలెంట్‌ ఈ స్టార్ సొంతం. పెద్ద పెద్ద దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎవరైనా ఉన్నారా..? అంటే.. మ్యూజిక్‌ లవర్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కూడా అనిరుధ్ రవిచందర్ దే. అందుకే ప్రస్తుతం ఈ కుర్ర సంగీత దర్శకుడు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.ఇక కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో ప్రస్తుతం ఆయనతోనే కలిసి పనిచేసేందుకు అందరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం ఆయన తెలుగు తమిళం హిందీ ఇండస్ట్రీలో కలిపి మొత్తం 10కి పైగా సినిమాలకు సంగీతం అందిస్తుండటం విశేషం.


వాటిలో దాదాపుగా అన్ని కూడా స్టార్ హీరోల చిత్రాలే.కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న  దేవరకు అనిరుధే సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఆయన ఎలాంటి సంగీతం అందిస్తారా అని ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దళపతి విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబో అయిన 'లియో'కు కూడా అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నారు.అలాగే యూనివర్సల్ స్టార్ కమల్-దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'భారతీయుడు 2', సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్' ఇంకా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్-అట్లీ కాంబో 'జవాన్', విజయ్ దేవరకొండ-సమంత వీడీ 12లతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, శింబు నటిస్తున్న సినిమాలకు కూడా ఈయనే స్వరలా సమకూరుస్తున్నారు. ఇంకా అలాగే మరికొన్ని ప్రాజెక్టుల కోసం కూడా చర్చలు జరుగుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: