క్రీడలను ఎలా అయితే కొంతమంది ప్లేయర్స్ క్రియేట్ చేసిన రికార్డులో ఇక ఆ తర్వాత కాలంలో చెక్కుచెదరకుండా ఉంటాయో.. అటు సినిమాల్లో కూడా కొంతమంది హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు ఇక ఏ హీరోకి కూడా బ్రేక్ చేసేందుకు సాధ్యం కాని రీతిలో ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలా అరుదైన రికార్డులు క్రియేట్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు అని చెప్పాలి. ప్రతి విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించింది సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పాలి.


 తొలి కలర్ సినిమా.. తొలి 70 ఎం ఎం సినిమా.. తొలి కౌబాయ్ సినిమా ఇలా చెప్పుకుంటే.. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో విషయాలను తన సినిమాలతోనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే హీరోయిన్లతో నటించడం విషయంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఒక అరుదైన రికార్డును సృష్టించారు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఈ రికార్డు బ్రేక్ చేయలేకపోయాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక కాంబినేషన్ రిపీట్ అవడం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా విజయనిర్మలతో ఎక్కువ సినిమాలు చేశారట. ఏకంగా వీరిద్దరి కాంబినేషన్లో సుమారు 48 సినిమాలు వచ్చాయట.


 అదే సమయంలో ఇక అప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద తో కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువ సినిమాల్లోనే నటించారు. జయప్రదతో ఏకంగా 47 చిత్రాలలో నటించారు కృష్ణ. అతిలోక సుందరి శ్రీదేవితో 31 సినిమాలలో నటించడం గమనార్హం. మరోవైపు అందాల తారగా పేరు సంపాదించుకున్న రాధ తో 23 సినిమాల్లో నటించి సరికొత్త రికార్డు సృష్టించారు. 25 సినిమాలలో ద్విపత్రాభినయం ఇక 7 సినిమాలలో త్రిపాత్రాభినయం కూడా చేసి రికార్డు సృష్టించారు. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో 100 సినిమాల్లో నటించిన కృష్ణ ఇక ఎవర్ గ్రీన్ రికార్డును క్రియేట్ చేసారు. ఇలా స్టార్ హీరోయిన్లతో ఎక్కువ సినిమాల్లో నటించి ఇప్పటికీ ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డులను సృష్టించారు కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: