తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈ నటుడు దేవదాస్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలలో నటించి ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఆఖరిగా రామ్ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ది భార్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను నిరోత్సాహపరిచిన ఈ యువ హీరో ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా బృందం ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను "బోయపాటి రాపో" అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కేవలం మూవీ కి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్స్ సన్నివేశాలని 24 రోజుల పాటు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను అత్యాధునిక టెక్నాలజీతో ... అదిరిపోయే రేంజ్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: