ఈమధ్య సోషల్ మీడియాలో తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు చిరంజీవి. నగరంలో ఒక హాస్పటల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ చిరంజీవి తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. ఈమధ్య తాను రెండు సార్లు కొల్నోస్కోపి టెస్ట్ లు చేయించుకున్నానని అలా చేయించుకోవడం వల్ల తన ఆరోగ్య పరిస్థితి తనకు తెలియడమే కాకుండా భవిష్యత్ లో తనకు ఎటువంటి అనారోగ్యం రాబోతోందో అన్న విషయమై క్లారిటీ వచ్చి తగుజాగ్రత్తలు తీసుకుంటానికి వీలవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇదే సందర్భంలో ఆరోగ్య విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి వివరిస్తూ తాను ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ యోగ ధ్యానం కూడ చేస్తానని అంతేకాదు తనకు ఎటువంటి అనారోగ్యం రాదు అన్న పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటానని అందువల్లనే తన ఆరోగ్యం ఇప్పటికీ బాగుంది అని అంటున్నాడు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు చాల ముందు చూపుతో ఉండాలని అలా ఉన్నప్పుడే ఏవ్యక్తి అయినా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు అంటూ తన అభిమానులు అంతా ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోమని చిరంజీవి చెపుతున్నాడు.

తన ఆరోగ్యం పై వస్తున్న రకరకాల వార్తల పై క్లారిటీ ఇవ్వడానికి తాను ఇన్ని విషయాలు చెపుతున్నాను అని అన్నాడు. అంతేకాదు ప్రతి వ్యక్తి క్యాన్సర్ పట్ల అదేవిధంగా ధీర్గకాలిక వ్యాధులకు సంబంధించి అవగాహన కలిగించుకుని మంచి డాక్టర్ సలహాతో మంచి వైద్యం చేయించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా త్వరగా తీరిపోతాయి అని అంటున్నాడు.

అయితే చిరంజీవి మాట్లాడిన ఈమాటలు క్షణాలలో వైరల్ గా మారి చిరంజీవికి క్యాన్సర్ వచ్చింది అంటు ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి మాట్లాడిన సందర్భం వేరు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యం పట్ల ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలాని చెప్పిన మాటలు నెగిటివ్ ప్రచారానికి దారితీసాయి అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: