‘ఏజెంట్’ అఖిల్ కు మాత్రమే కాదు దర్శకుడు సురేంద్రరెడ్డికి కూడ ఊహించని భయంకరమైన షాక్ ఇచ్చింది. మహాభారతంలో కర్ణుడి మరణానికి ఎన్ని కారణాలు చెపుతారో ‘ఏజెంట్’ భయంకరమైన ఫ్లాప్ కు అన్ని కారణాలు ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. ఈసినిమా ఎడిటింగ్ దశలో ఉండగా నిర్మాత దగ్గర నుండి దర్శకుడు హీరో ఇలా ఎవరికి వారు కథ విషయంలో ఎడిటింగ్ విషయంలో స్క్రీన్ ప్లే విషయంలో రకరకాలుగా మితిమీరిన సలహాలు ఇవ్వడంతో ఈసినిమా పరిస్థితి అలా అయింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.ఈసినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈసినిమా బయ్యర్లకు 25 కోట్ల నష్టం వచ్చింది అన్నప్రచారం జరుగుతోంది. అయితే ఈ నష్టాన్ని ఎంతోకొంత భరించమని ఈమూవీ నిర్మాత దగ్గరకి వెళ్ళినప్పటికీ ఈమూవీ వల్ల తనకు కూడ 20 కోట్ల నష్టం వచ్చిందని చెపుతూ ఆమూవీ నిర్మాత తన కష్టాలను ఈమూవీ బయ్యర్లతో చెప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి ఈసినిమాకు నిర్మాణ భాగస్వామిగ దర్శకుడు సురేంద్రరెడ్డి ఈమూవీ పోష్టర్ పై పేరు పడిన సందర్భంలో అతడిని కూడ కలిసి తమ కష్టాలను వివరిస్తే మార్గం దొరుకుతుంది అన్న ఆశలో ఈమూవీ బయ్యర్లు ఉన్నారు అని మరికొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈమూవీకి దర్శకుడుగా వ్యవహరించిన సురేంద్రరెడ్డికి కేవలం 6 కోట్లు మాత్రమే పారితోషికం వచ్చిన నేపధ్యంలో ఇలాంటి భారీ నష్టాలను సురేంద్రరెడ్డి ఎంతవరకు బాధ్యత వహించి సెటిల్ చేస్తాడు అంటూ మరికొందరు ఈమూవీ బయ్యర్ల పై జాలి చూపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అఖిల్ తో ‘ఏజెంట్’ మూవీ మొదలుపెట్టినప్పుడు ఆమూవీని 40 కోట్లతో పూర్తిచేయాలని నిర్మాతలు అదేవిధంగా సురేంద్రరెడ్డి భావించారని అని అంటారు. అయితే ఈమూవీ మొదలుపెట్టిన తరువాత కరోనా లాక్ డౌన్ లు ఆతరువాత ఈమూవీ కథలో మార్పులు ఆపై భారీ గ్రాఫిక్స్ ఇలా అనేక కారణాలు ఎదురవ్వడంతో ఈమూవీ బడ్జెట్ 70 కోట్లను దాటిపోయింది అని అంటారు. ఏది ఎలా ఉన్నా ‘ఏజెంట్’ అఖిల్ తో పాటు ఈమూవీని తీసిన నిర్మాతలకు దర్శకుడుకి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: