మొదట గుంటూరు టాకీస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రతి ఒక్కరికి సిపరచితమే.. ఆ తర్వాత డిజె టిల్లు చిత్రంతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రస్తుతం భారీ అంచనాలు ఏర్పరిచేలా చేస్తోంది. డీజే టిల్లు సినిమా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్స్ హీరో మధ్య జరిగే సన్నివేశాలు డైలాగులు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.


ఇక ఈ చిత్రం సీక్వెల్ కూడా ఉండబోతుందని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. ఈ చిత్రానికి మించి ఈ సినిమా ఉండబోతోంది అని టాక్ వినిపించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది చిత్ర బృందం ఈ సినిమా సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధంగా ఉన్నది. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మొదటి భాగంలో నేహా శెట్టి నటించగా రెండో భాగంలో స్టార్ హీరోయిన్ ని ఎంచుకోవడం జరిగింది.

అయితే ఈసారి డబుల్ ల్ ఫంన్ డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా నిన్నటి రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ ని విడుదల చేస్తూ సిద్దు అనుపమ సంబంధించి ఒక పోస్టర్ని విడుదల చేశారు ఇందులో సిద్దు అనుపమ ఒకే కారులో ఉంటూ అనుపమ సిద్దు పెదాల పైన చెయ్యి అడ్డం పెట్టుకొని కూర్చున్నటువంటి ఫోటోని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: