అర్జున్ రెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అంతేకాదు బోల్డ్ కంటెంట్ తో వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పాలి. అందుకే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. అయితే ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయి సూపర్ హిట్ను కట్టపెట్టేసారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతోనే అటు ఒక సాదాసీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నేటి జనరేషన్ కు తగ్గట్లుగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో ఈ సినిమా రూపుదిద్దుకుంది అని చెప్పాలి. ఇందులో శాలిని పాండే హీరోయిన్గా నటించింది. రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్,  కమల్ కామరాజు కీలకపాత్రలో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది అని చెప్పాలి. ఇక యూత్ ను అయితే విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అర్జున్ రెడ్డి. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాకి మొదటి ఛాయిస్ విజయ్ దేవరకొండ కాదట. మొదట ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను అల్లు అర్జున్తో తీయాలని అనుకున్నాడట. అయితే అల్లు అర్జున్ కు కథ నచ్చింది కానీ రౌడీ హీరో పాత్ర తనకు సెట్ కాదని సున్నితంగా ఆఫర్ తిరస్కరించాడుట. ఆ తర్వాత శర్వానందును సంప్రదిస్తే శర్వానంద్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో సినిమాకు నో చెప్పాడట. చివరికి విజయ్ దేవరకొండ చేతికి వెళ్ళింది ఈ సినిమా. అయితే ఈ శర్వానంద్ ఈ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: