తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ యాంకర్లుగా వారి కెరీర్ కొనసాగిస్తున్నారు. అందులో శ్రీముఖి ఒకరు. ఈ భామ తనదైన చలాకితనం, యాంకరింగ్ స్టైల్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడి చూపును తన వైపుకు తిప్పుకుంది. పటాస్ షోలో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ప్రస్తుతం టీవీ షోలలో ఎక్కడా చూసిన ఈమెనే కనిపిస్తోంది. ఒకానొక సమయంలో యాంకర్ అంటే సుమ పేరు మాత్రమే వినిపించేది. నేటి కాలంలో శ్రీముఖి పేరు విపరీతంగా మార్మోగిపోతుంది. 

ఈ అమ్మడు అందానికి, మాటలకు, విపరీతంగా అభిమానులు ఉన్నారు. అనేక షోలలో హోస్టింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా, రీసెంట్ గా శ్రీముఖి ఓ షోలో తనకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. అందులో శ్రీముఖి చాలా లావుగా, బొద్దుగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాను పదవ తరగతి చదివే సమయంలో చాలా లావుగా ఉండేదాన్నని శ్రీముఖి చెప్పింది. ఆ సమయంలో 100 కిలోలకు పైనే బరువు ఉండేదాన్నని రెండు బిర్యానీ ప్యాకెట్లను కూర్చొని తినేదాన్నని శ్రీముఖి వెల్లడించింది.

ఇక యాంకర్ కావాలనే కోరికతో తిండిని పూర్తిగా తగ్గించేసి పట్టుదలతో ఇలా అయ్యానని శ్రీముఖి వెల్లడించింది. శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో లావుగా ఉందని అనేక రకాల విమర్శలను ఎదుర్కొంది. వారందరికీ తాను సన్నగా, నాజూకుగా తయారయ్యి అందరికి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నేను ఒక రోజులో ఒకే పూట ఆహారం తీసుకుంటానని శ్రీముఖి అన్నారు. నా ప్రొఫెషన్ మీద ఉన్న ఫ్యాషన్ తోనే ఇలా ఆహారం పూర్తిగా తగ్గించానని శ్రీముఖి తన విషయాలను షేర్ చేసుకున్నారు. శ్రీముఖి షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలామంది శ్రీముఖి పట్టుదలను చూసి మెచ్చుకుంటున్నారు. తిండిని పక్కన పెట్టేసి తన కలను నెరవేర్చుకుందని ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: