శృతిహాసన్ స్టార్ కిడ్ అయినప్పటికీ కూడా ఆ గర్వం ఉండదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో ఈ బ్యూటీ ఎప్పుడు ముందే ఉంటుంది. ముఖ్యంగా తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తుంది. ఆఖరికి తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా శృతి స్వయంగా పంచుకుంది. అందంగా క‌నిపించ‌డం కోసం సినీ తారలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం సర్వసాధారణం. అయితే ట్రోలర్స్ కు భయపడి ఇటువంటి విషయాలను బయటకు వెల్లడించేందుకు ఎవ్వరూ ధైర్యం చేయరు.


కానీ శృతిహాసన్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. చాలా ఇంటర్వ్యూల్లో ఆమె స్వయంగా తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించింది. తాజాగా మరోసారి ఈ విషయంపై ఆమె రియాక్ట్ అయింది. `టీనేజ్ లో ఉన్నప్పుడే నా ముక్కు నాకు నచ్చ‌లేదు. అందుకే సర్జరీ చేయించుకున్నాను. ఫేస్ మరింతగా అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడాను. ఈ విష‌యాల‌ను బయటకు చెప్పడం ఎందుకని కొంద‌రు దాచుకుంటారు. వాళ్ల అభిప్రాయాన్ని నేను గౌర‌విస్తాను.


అలాగే నాలా ధైర్యంగా చెప్పుకునే వాళ్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏజ్ బార్ అయ్యాక ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటాన‌మో. నా బాడీ.. నా ఇష్టం. ఇత‌రుల‌కు నొప్పి లేన‌ప్పుడు ప్ర‌శ్నించే హ‌క్కు, విమ‌ర్శించే హ‌క్కు లేదు` అంటూ ట్రోల‌ర్స్ కు శృతి హాస‌న్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, ప్రస్తుతం శృతి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో `కూలీ` మూవీ చేస్తోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతోంది. అలాగే ద‌ళ‌ప‌తి విజ‌య్ తో `జన నాయగన్`, విజ‌య్ సేతుప‌తితో `ట్రైన్` మ‌రియు ప్ర‌భాస్ తో `స‌లార్ 2` చిత్రాలు శృతి హాస‌న్ లైన‌ప్‌లో ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: