పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు సినీప్రపంచంలో ఒకప్పుడు వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ మరెవరో కాదు – అనుష్క శెట్టి. మంగళూరులో పుట్టిన ఈ అందగత్తె నాగార్జునతో కలిసి నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్, రానా, విక్టరీ వెంకటేష్, గోపీచంద్ వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా అరుందతి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. లేడీ ఓరియెంటెడ్ మూవీలకు కూడా మార్కెట్ ఉంటుందనే విషయాన్ని నిరూపించింది.


తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిన అనుష్క, బాహుబలి 1, 2లో దేవసేన పాత్రతో మాత్రం మరపురాని ఇమేజ్ సంపాదించింది. ఆమె లుక్, నటన, యాక్షన్ - అన్నీ కలిపి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అంతేకాదు, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాల్లోనూ తన నటనతో అలరించింది. గ్లామర్ రోల్స్‌తో పాటు విభిన్న పాత్రలను కూడా పోషిస్తూ తన వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌ను చూపించింది. అందుకే ఆమెను లేడీ సూపర్‌స్టార్ అని పిలుస్తారు. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మాత్రం కొంచెం సైలెంట్ అయింది. ఒక్కోసారి మాత్రమే సినిమాలతో ముందుకు వస్తోంది. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ఘాటి సినిమాలో నటించినప్పటికీ, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.

 

అయినప్పటికీ అనుష్క అందం, నటన మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్‌తో ఇంకా హీరోయిన్‌గా రాణించగల సామర్థ్యం ఉందని అభిమానులు అంటున్నారు. సినిమాల్లోకి రాకముందు బెంగళూరులోని ఈస్ట్‌వుడ్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసిన అనుష్క, తరువాత యోగా బోధకురాలిగా కూడా కొనసాగింది. తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదగడం నిజంగా ప్రేరణాత్మకం. నేటికీ ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన పాత ఫోటో ఒకటి అభిమానులు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.. లేడీ  సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అనుష్క ఇక మరి మళ్లీ బాక్సాఫీస్ దగ్గర అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ ఎప్పుడు ఇస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: