అయితే కేంద్రంలో మోడీ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలను యోగి ఆదిత్యనాథ్ ఎంతో సమర్థవంతంగా వినియోగించుకున్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ రహదారుల దగ్గర్నుంచి గ్రామీణ రహదారుల వరకు కూడా వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పథకాలను సూపర్ గా వాడేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరును వేసుకుంటూ ఉంటాయి. కానీ కొంతమంది కేంద్ర పథకాలను వాడుతున్నప్పటికీ సమర్థవంతంగా ఆ పనులు పూర్తి చేయలేక విమర్శలు ఎదుర్కొంటుంటారు. కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం మోడీ పథకాలను తెగ వాడేస్తున్నారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా భారీగా మెడికల్ కళాశాలలు కట్టేందుకు అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. మెడికల్ కళాశాల నిర్మాణానికి భారీగా నిధులు సైతం కేటాయిస్తోంది. జిల్లా జిల్లా కి ఒక మెడికల్ కళాశాల ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది కేంద్రం. అయితే ఇక కేంద్రం తీసుకొచ్చిన ఈ సరికొత్త పథకాన్ని యోగి ఆదిత్యనాథ్ వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్న యూపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా తొమ్మిది మెడికల్ కళాశాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మొత్తంగా చూసుకుంటే గతంలో 70 ఏళ్ళలో కేవలం 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే.. కేవలం నాలుగు ఏళ్ళలో 59 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం. ఇది అభివృద్ధి లో సంచలనం అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి