RBI తెలిపిన వివరాల ప్రకారం జూన్ 30 2025 నాటికి క్లైమ్ చేయని డిపాజిట్లలో 58,330.26 కోట్ల రూపాయలు ఉందా ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే రూ . 8,673.72 కోట్ల రూపాయలు ఉన్నదని తెలిపారు. ఇందులో ఎస్బిఐలో రూ. 19,329.92 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 6,910.67 కోట్లు, కెనరా బ్యాంకులో రూ. 6,278.19 కోట్లు ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. ఇదే కాకుండా మరికొన్ని బ్యాంకు సెక్టార్లలో ఉన్నాయంటూ తెలిపారు.
ముఖ్యంగా ఈ డిపాజిట్లలో ఎక్కువమంది తమ కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించలేక ఆ అకౌంటలలో డబ్బులు అలాగే మిగిలిపోయినట్లుగా తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం వృద్ధాప్యంలో తమ పిల్లలు తమను వదిలేస్తే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గ్రహించి.. పిల్లలకు చెప్పకుండా డబ్బులు అవసరమని భావించి దాచుకుంటున్నారు. అలా మిగిలిపోతున్నటువంటి డబ్బులే రూ.67 వేల కోట్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని కొన్ని రోజులు పోయిన తర్వాత RBI లెక్క చెప్పి మరి ప్రభుత్వానికి జమ చేస్తోంది. అలా ఇప్పటికే రూ.2000 కోట్ల రూపాయలను జమ చేయగా, ఇప్పుడు ఏకంగా 67 వేల కోట్ల రూపాయలకు చేరింది. మరి ఈ డబ్బులను RBI ఏం చేస్తుందనే విషయం తెలియాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి