గత కొంతకాలం  నుంచి ప్రపంచ క్రికెట్లో ఒక నయా ట్రెండ్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది మాజీ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ట్రెండును బాగా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ నయా ట్రెండ్ ఏంటో తెలుసా.. అంతర్జాతీయ క్రికెట్లో జరగబోయే కీలక మ్యాచ్ కు ముందు ఇక ప్రతి మాజీ ఆటగాడు కూడా తన ప్లేయింగ్ జట్టును ప్రకటించడం చేస్తూ ఉన్నారు. అంటే ఇక కీలకమైన మ్యాచ్ కోసం ఇక జట్టులో ఉండే 11 మంది ఆటగాళ్లు ఎవరైతే బాగుంటుంది అనే దానిపై ఇక తమ అభిప్రాయం ప్రకారం రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇలా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రకటిస్తున్న ప్లేయింగ్ ఎలెవెన్ టీం చూస్తూ అటు అభిమానులు కూడా మ్యాచ్ పై మరింత అంచనాలను పెంచేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇక జూన్ 7వ తేదీ నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లందరూ మరోసారి ఇలా ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించడం చేస్తూ ఉన్నారు. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా, భారత జట్ల ఆటగాళ్లు అక్కడ ప్రాక్టీస్ లో మునిగితేలుతూ ఉన్నారు. అయితే ఇటీవల ఈ మ్యాచ్ లో ఇక టీమిండియా ప్లేయింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అని దానిపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఈ క్రమంలోనే తన ప్లేయింగ్ ఎలెవన్ జట్టుని  ప్రకటించాడు. ఆ లిస్టు చూసుకుంటే రోహిత్ శర్మ గిల్ లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో పూజార కోహ్లీ రహానే లను తీసుకున్నాడు. కీపర్ గా శ్రీకర్ భరత్ ను ఎంచుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లుగా జడేజా అశ్విన్లకు చోటు కల్పించిన గవాస్కర్.. ఫేసర్లుగా  సిరాజ్, శమీ, శార్దూల్ ఠాగూర్లను ఎంపిక చేసాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: