ఇటీవలే గాయం  బారినపడి ఎన్నో రోజుల పాటు జట్టుకు దూరమైన రాహుల్ ఆసియా కప్లో భాగంగా మళ్లీ మునుపటిలా ఫామ్  అందుకుంటాడని  అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్లో భాగంగా రెండు మ్యాచ్ లలో కూడా ఓపెనర్లుగా బరిలోకి దిగిన కె.ఎల్.రాహుల్ దాటిగా  ఆడలేక ఎంతగానో  ఇబ్బంది పడ్డాడు. పాకిస్తాన్ పై మ్యాచ్ లో మొదటి బంతికే డకౌట్  పెవిలియన్ చేరాడు. ఇక హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 36 పరుగులు చేశాడు క్రీజ్లో కుదురుకున్నాడనుకులోపే చివరికి వికెట్ కోల్పోయాడు.


 దీంతో కె.ఎల్.రాహుల్ ప్రదర్శనపై ప్రస్తుతం విమర్శలు మొదలయ్యాయి అని చెప్పాలి.  ఇలాంటి సమయంలో ఇక కె.ఎల్.రాహుల్ కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. ఇటీవలే ఓ క్రీడా ఛానల్ తో మాట్లాడిన సునీల్  గవాస్కర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మరికొంతమందికి టీమిండియా మేనేజ్మెంట్ మద్దతుగా నిలుస్తుంది. అచ్చం ఇలాగే రాహుల్ కు కూడా అవకాశాలు ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించాడు. హాంకాంగ్ జట్టుపై   నెమ్మదిగా ఆడాడని  ఎంతో మంది అతని పై విమర్శలు గుప్పిస్తున్నారు.


 అయితే ఇది సరైంది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎంతో క్లాస్ ప్లేయర్.. చాలా ఏళ్ళపాటు టీమిండియా తరఫున ఆడాడు.. ఇతర ఆటగాళ్లకు చాలానే అవకాశాలు ఇచ్చారు కదా.. మరి కేఎల్ రాహుల్ కు ఎందుకు అవకాశాలు ఇవ్వరు.. అంతకు మించి అతడు భారత జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. టి20 ఫార్మాట్లో కె.ఎల్.రాహుల్ సామర్థ్యం ఏంటో ఇప్పటివరకు అందరం చూశాము. అతను గాయం నుంచి కోలుకుని వచ్చాడు. తన మునుపటి ఫామ్  అందుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.  అతనికి అవకాశాలు ఇవ్వాల్సిందే అంటూ  అభిప్రాయపడ్డాడు సునీల్  గవాస్కర్.  ఇక మరో మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా సునీల్  గవాస్కర్  వ్యాఖ్యలను సమర్ధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: