నోట్ల రద్దు విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించేవరకు ఆ విషయం ఎవరికీ తెలియదు. నోట్ల రద్దు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక ఎన్నో కసరత్తులు, సమావేశాలు నిపుణులతో చర్చలు తదుపరి ఈ నిర్ణయాన్ని మోదీ ప్రకటించారు. సామాన్యులతో పాటు విపక్షాలు నోట్ల రద్దు ప్రకటనతో ఖంగుతిన్నారు.  ఇలాంటి ఊహించని  నిర్ణయాలు ప్రకటించడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తుడు.


ఇది సోషల్ మీడియా యుగం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ , కేబుల్ మరోవైపు గూడాఛార్యాలు, చీమ చిటుక్కుమన్నా ప్రచారం చేసి వైరల్ చేసే సోషల్ మీడియా మధ్య మనం ఉన్నాం. అయితే ఇన్ని సామాజిక మాధ్యమాలు, ఇంత నెట్ వర్క్ కవరేజీ ఉన్న మీడియాలో కూడా మోదీ తన నిర్ణయం ప్రకటించేవరకు ఏమీ బయటకు పొక్కలేదు. ఉదాహరణకు నోట్లరద్దు, ఆర్టికల్ 370, సర్జికల్ స్ర్టైక్ 1, 2 లు ప్రభుత్వం చెప్పే వరకు ఎవరికీ తెలియదు.


ఆ పరంపరను కొనసాగిస్తూ మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకు వచ్చారు.  ఎవరైనా ఈ తరహా బిల్లులకి అతి ప్రచారం కోరుకుంటారు. ఈ బిల్లుపై తామే ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొని ఓట్లు దండుకునే అవకాశం ఉంటుంది. కానీ మోదీ అలా చేయలేదు. అసలు ఈ బిల్లుకి సంబంధం లేని ఎమ్మెల్సీ కవిత మా వల్లే ఈ బిల్లు ప్రవేశ పెట్టారని ప్రచారం చేసుకుంటుంది. ఆ పార్టీలో కనీసం పది శాతం కూడా మహిళా అభ్యర్థులు లేరు.  


ఈ బిల్లుపై ఎటువంటి ప్రచారం ఆర్భాటం లేకుండా చాలా ప్రశాంతంగా క్యాబినెట్ లో తీర్మానం చేసి , ఆ తర్వాత బిల్లు ప్రవేశపెట్టింది. వినాయక చవితి రోజు పేపర్లు ఉండవని తెలిసినా, కవరేజీ గురించి ఆలోచించకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.  ప్రచార యావ, ఈ గుర్తింపు అంతా తమకే దక్కాలనే ఆలోచన లేకుండా వ్యూహాత్మకంగా మోదీ అనుసరిస్తున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: