
అందుకే ... మంత్రివర్గంలో ఎవరైనా..హోం శాఖ దక్కితే బాగుంటుందని కలలు కంటూ ఉంటారు. గతం లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు..తొలిసారి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మహిళ(సబితా ఇంద్రారెడ్డి)కు ఈ శాఖను కేటాయించారు. తర్వాత.. చాన్నాళ్లకు.. నవ్యాంధ్రలో మహిళకు కేటాయించారు. అది కూడాఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించి జగన్ రికార్డు సృష్టించారు. అయితే.. ఇప్పుడు ఎవరికి ఇస్తునన్నారు.. ఏ సామాజిక వర్గానికి ఈ అత్యున్నత స్థాయి బెర్త్ దక్కుతుంది? అనేది ఆసక్తికర చర్చ గా ఉంది. దీనిని పరిశీ లిస్తే.. ఈ దఫా కూడా ఎస్సీ సామాజిక వర్గానికే దక్కుతుందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
అయితే.. కొంత మేరకు మార్పు ఉంటుందని అంటున్నారు. ఎస్సీల్లోని పురుష ఎమ్మెల్యేలకు ఈ దఫా హొం పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పేరు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ఒకవేళ.. పురుషుడికి కాకుండా.. మహిళకు ఇచ్చే అవకాశం ఉంటే.. కడప జిల్లా బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సుధకు దక్కుతుందని ప్రచారంలో ఉంది. మొత్తంగా ఎవరికి ఇచ్చినప్పటికీ. ఈ పదవిలో వ్యక్తులు మారతారే తప్ప.. సామాజిక వర్గం మాత్రం అదే ఉంటుందని.. దీనిని ఎట్టి పరిస్తితిలోనూ కదిలించే అవకాశం లేదని.. మాత్రం కరాఖండీగా చెబుతున్నారు.