రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడు వేగనార్ గ్రూప్  హెడ్. ఇప్పుడు ఆయన అత్యంత ప్రమాదకరమైన హెచ్చరికను జారీ చేసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా భాగ్పుత్ ను మొదట ఆక్రమించుకుంది వ్యాగనార్ గ్రూప్, ఆ తర్వాత దాన్ని రష్యాకు అప్పచెప్పారు. అక్కడున్న పెద్ద గేటు ఓపెన్ అయిపోయింది. దాంతో వాళ్ళు డొనేట్స్ కి, లుపాన్స్ కి, జెపోరీజియా, కేర్సన్ ప్రాంతాలపై పడి విచ్చలవిడిగా దాడి చేస్తున్నారని తెలుస్తుంది.


అసలు మొదట్లో వ్యాగనార్ గ్రూపు గాని, చర్చిల్ గ్రూపు గాని ఏం ఆలోచించారంటే రష్యా భాషను ఎక్కువగా మాట్లాడే వాళ్ళ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే యుద్ధం ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఇది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసుకెళ్లేలా ఉందని వ్యాగనార్ గ్రూప్ ఛీఫ్ ఆందోళన వ్యక్తం చేయడం సంచలనాన్ని కలిగిస్తుంది ఇప్పుడు.


రష్యాకు చెందిన మెర్సినరీ గ్రూప్ వ్యాగనార్ చీఫ్ యాగ్ని బ్రిజ్నో   3వ ప్రపంచ యుద్ధం రాబోతోందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా కొత్త రిక్రూటీలు పారామిలిటరీ గ్రూప్‌లో చేరాలని, సైన్యంలో చేరాలని ఆసక్తిగా ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా మామూలు జనాలకి కూడా ఒక ఆర్డర్లా వీడియో ద్వారా పిలుపునిచ్చారు. వ్యాగనార్ యంత్రాలు రష్యా ఉక్రేనియన్ దాడిలో ఎక్కువగా పాల్గొన్నట్లు తెలుస్తుంది.  ప్రత్యేకించి భాగ్పుత్ నగరం  కోసం జరిగిన ఆ పోరాటం ఉక్రెయిన్‌లో మాస్కో యొక్క అత్యంత సుదీర్ఘమైన ఇంకా రక్తపాతమైన దాడిగా పేర్కొన్నారు.


ఇప్పటివరకు రష్యా తరపున ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి రండి మిమ్మల్ని యుద్ధంలో చేర్చుకుంటాం అంటూ ప్రపంచవ్యాప్తంగా  యువతకు పిలుపునిచ్చినటువంటి వ్యాగనార్ గ్రూప్ ఇప్పుడు తన స్వరాన్ని మార్చింది అన్నట్టుగా తెలుస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది కాబట్టి రష్యా తరఫున సైనికులుగా పోరాడడానికి రండి అంటూ పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మూడో ప్రపంచ యుద్ధం అనే మాట ఎత్తగానే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: