ఆంధ్ర, తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి మంచి అనుకూల సమయం ఉంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో  బీజేపీ సభ్యత్వం తీసుకున్న వారు దాదాపు 70 లక్షల మంది వరకు ఉంటారు. ఇలాంటి సమయంలో బీజేపీ పొత్తులకే ఎందుకు పరిమతమవుతోందని ఆ పార్టీలోని కొంతమంది అనుకూల వ్యక్తులే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పరివార సభ్యలు మరో 30 నుంచి 40 లక్షల మంది వరకు ఉంటారు.


అంటే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా బీజేపీ అనుకూల మైన వ్యక్తులు ఉన్నా ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతోందని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 7 కోట్ల మంది ఓటర్లు ఉంటే ప్రతి ఏడుగురు సభ్యుల్లో ఒకరు బీజేపీ కార్యకర్తే కదా? ఇందులో ఒక్కో బీజేపీ కార్యకర్త ముగ్గురితో ఓట్లు వేయిస్తే చాలు బీజేపీకి దాదాపు 60 శాతం ఓట్లు వస్తాయి.  


గ్రామ, బూత్, మండల స్థాయి కమిటీలు వేస్తారు. కానీ ఎప్పుడో ఒక సారి మాత్రమే మీటింగ్ పెట్టుకుంటారు. దాన్ని ఆచరణ లో పెట్టడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ అనేవి సమాచారాన్ని చేరవేసే సాధనాలు మాత్రమే. ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి బీజేపీ జాతీయ విధానం మా నినాదం అని చెప్పగలిగే నాయకులు కరవయ్యారు. 10 సంవత్సరాల కిందట రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం తెచ్చి ఇవ్వగలరు.


బీజేపీ గెలిస్తే ఎలాంటి పనులు చేస్తారు. ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఓట్లు సాధించవచ్చు. కానీ దాన్ని ఎక్కడో మిస్ అవుతున్నారు. బీజేపీకి కార్యకర్తల బలం ఉంది. దాన్ని సరైన దారిలో పెట్టే నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించడం లేదు. సరైన దిశలో పార్టీని నడిపి కార్యకర్తల బలంతో ప్రజల్లో అవగాహన కలిగిస్తే అధికారంలోకి రావడం పెద్ద విషయం ఏమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP