కాలంతో పాటు మనుషులు మారుతున్నారు. కొంతమందికి టైం అనేది చాలా విలువైనదిగా భావిస్తూ ఉద్యోగ కారణాల రీత్యా వంట చేసుకోరు. అలాంటి సమయంలో వంట మనుషులను పెట్టుకుని వంట చేసేసుకుంటారు. మరికొందరికి వంట చేయడం రాక, స్విగ్గి, జమోటాలకు వెళుతుంటారు. ఇలా వంట చేయకుండా, నేర్చుకోకుండా ఉంటున్నారు. కొంతమంది బద్ధకంతో పని చేయడానికి, అంట్లు తోమడం ఇష్టం లేక బుకింగ్ చేసేసుకొని తినేస్తుంటారు.


గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమయంలో దాదాపు 20, 30 మందికి ఇంట్లోనే వంట చేసుకుని తినేవారు. అందరూ తలో చేయి వేసి పని చేసుకునేవారు. ఏదైనా పెద్ద పండగ జరిగినా కూడా అందరూ కలిసి వంటలు చేసేవారు. కానీ వంట మనుషుల వంట అనేది ఉండేది కాదు. ప్రస్తుతం పెళ్లి, సారీ పంక్షన్, సత్యనారాయణ పూజ, శుక్రవారం అమ్మవారు పండగ, బోనాల జాతర, ఇలా ప్రత్యేకంగా ఏ పండగ ఇంట్లో చేయాలన్నా వంట పని వారిని మాట్లాడి చేసేస్తున్నారు.


100 మందికి పైగా భోజనం పెట్టాలంటే వంట మనుషులు తప్పనిసరి. కానీ చిన్న చిన్న పంక్షన్లకు వంట మనుషులు ఒక్కో సారి దొరకని వైనం. ఇంట్లోనే వంట వండించుకునేందుకు బుక్ మై చెఫ్ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఏ వంటలైతే కావాలనుకుంటున్నారో అవి ముందుగానే చెబితే దానికి సంబంధించిన చెఫ్ లు అందుబాటులోకి వస్తారు. దీని వల్ల ఇటు వంట పని చేసే చెఫ్ లకు, కూరగాయలు కట్ చేసే వారికి, అంట్లు తోమే వారికి సైతం ఉపాధి లభిస్తుంది.


ఇదొక రకంగా చూస్తే మంచిదనిపిస్తుంది. మరో రకంగా చూస్తే జేబులో ఉన్న డబ్బులు కూడా బాగానే ఖర్చవుతాయి. ప్రస్తుత సమాజంలో ఖర్చుకు వెనకాడని వారు చాలా మందే ఉంటారు. సిటీల్లో బుక్ మై చెఫ్ యాప్ వాడుతూ చిన్న చిన్న పంక్షన్లు చేసేస్తున్నారు. కాలంతో పాటు మనుషులు కూడా మారాల్సిందేనని నిరూపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: