
ప్రభుత్వం కొలువు దీరి సరిగ్గా రెండు రోజులు కూడా కాలేదు. మంత్రి వర్గం ఇంకూ పూర్తిగానే కొలువు తీరలేదు. మంత్రులకే శాఖలే శనివారం మధ్యాహ్నం కేటాయించారు. ఇంతలో ఏదో జరిగిపోతున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రగతి భవన్ గోడలు తీయించారు. ప్రజా దర్బార్ నిర్వహించారు. కేబినేట్ సమావేశం ఏర్పాటు చేశారు.
మరోవైపు ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీల్లో ఒకటి అయిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అట్టహాసంగా ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ కింద వైద్య సాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారు. రెండు రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు. దీనిని ఒప్పుకోవాలి.
కానీ ఈ సారి ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ ఎలా పోషిస్తుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తప్ప. రెండో రోజే ప్రభుత్వంపై విమర్శలు చేయాలని కోరుకోవడం లేదు. తొందరపడిన కోయిల ముందే కూసింది అన్నట్లుగా హరీశ్ రావు రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు. ధాన్యం కూడా కల్లాలోనే ఉండిపోయిందని త్వరగా కోనుగోలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. వారికి కనీసం 100 రోజుల సాధారణ సమయం అయినా ఇవ్వాలి కదా. కల్లాల్లో ధాన్యం ఉందంటే బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మలేదు అనేగా అర్థం. ఎందుకు అనవసర చర్చ తీసుకురావడం. ఇందులో సమస్యలు ఉంటే జనం స్పందిస్తారు. అంతవరకు వేచి చూడాల్సింది. దీనిపై హరీశ్ ఆలోచించుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.