మన ఇంటి చుట్టు పక్కల  పెరిగే ఔషధ మొక్కలల్లో కుప్పింటాకు మొక్క కూడా ఒకటి. ఇక ఈ మొక్క ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.ఈ ఆకుని మనలో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఇది మంచి ఔషధ మొక్క అని మనలో చాలా మందికి తెలిసి ఉండదు.అయితే చాలా మంది పిచ్చి మొక్కగా భావించి దీనిని పీకేస్తూ ఉంటారు. కానీ కుప్పింటాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మన ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇక దీనిని సంస్కృతంలో విశ్వరూపిణి అని అంటారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా ఇంకా అలాగే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం చాలా ఈజీగా వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.ఇంకా అలాగే గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు వంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ కుప్పింటాకు బాగా పని చేస్తుంది.ఇందు కోసం కుప్పింటాకుకు సున్నాన్ని కలిపి మెత్తగా నూరాలి.తరువాత ఈ మిశ్రమాన్ని చర్మ సమస్యలు ఉన్న చోట లేపనంగా రాయాలి. ఇలా 4 నుండి 5 రోజుల పాటు రాయడం వల్ల చర్మవ్యాధులు ఈజీగా పూర్తిగా నయం అవుతాయి. ఇంకా అలాగే చెవుడును నివారించడంలో కూడా కుప్పింటాకు మనకు సహాయపడుతుంది. కుప్పింటాకు మొక్క ఆకులను, వెల్లుల్లి రెబ్బలను ఇంకా మిరియాలను కలిపి మెత్తగా నూరాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నువ్వుల నూనెలో వేసి వేడి చేయాలి. తరువాత ఈ నూనెను వడకట్టి స్టోర్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతి రోజూ 2 నుండి 3 చుక్కల మోతాదులో వారం రోజుల పాటు చెవిలో వేసుకోవడం వల్ల చెవుడు సమస్య ఈజీగా తగ్గుతుంది.


ఇంకా అదే విధంగా ఇలా తయారు చేసుకున్న నూనెను రాత్రి పడుకునే ముందుగ ముక్కులో వేసి పడుకోవాలి.ఇలా చేయడం వల్ల గురక సమస్య ఈజీగా తగ్గుతుంది.ఇంకా అదే విధంగా ఈ తైలాన్ని ఉపయోగించడం వల్ల మనం కీళ్ల నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తైలాన్ని నొప్పులు ఉన్న చోట రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయి. అలాగే పక్షవాతాన్ని తగ్గించడంలో కూడా కుప్పింటాకు మనకు చాలా బాగా సహాయపడుతుంది. కుప్పింటాకు వేర్ల బెరడు, వెల్లుల్లి రెబ్బలు ఇంకా మిరియాలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ను మాత్రలుగా చేసుకుని రోజుకు రెండు పూటలా మింగాలి. ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా పక్షవాతం సమస్య ఈజీగా దూరమవుతుంది. ఈ విధంగా కుప్పింటాకు మనకు చాలా బాగా సహాయపడుతుందని దీనిని వాడడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: