
ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. రెండు భాషల్లో హిట్ కొట్టినప్పటికీ సపోర్టింగ్ రోల్ చేస్తుండడంతో నవీన్ హాట్ టాపిక్ అయ్యాడు. ముఖ్యంగా యూత్‌లో నవీన్ కి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా చేశాడు. కాగా జాతిరత్నాలు సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ నేటితో పూర్తి చేశాడు ఈ యంగ్ హీరో. కాగా ఈ సినిమా రష్ చూసిన వారు సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందంటున్నారట..
ఇదిలా ఉండగా ఇటీవలే నవీన్ ఓ స్టార్ హీరో సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో ప్రచారం జరుగుతుందట. అయితే ఈ గాసిప్స్ పై నవీన్ స్పందిస్తూ.. నాపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని.. అదంతా కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఏమైనా జాతిరత్నాలు గాని హిట్ అయితే నవీన్ రేంజ్ మారిపోతుంది. హీరోగా అతనికి ఫుల్ డిమాండ్ పెరుగుతుందని అంతా అనుకుంటున్నారట.
నిజానికి ఈ కొత్త హీరో అదృష్టం మామూలుగా లేదు. కాగా ఈ జాతిరత్నాలు చిత్రం కరోనా తర్వాత థియేటర్స్‌కి రానుందంటున్నారు.. ఇకపోతే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రెండో భాగం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. తన రెండో సినిమా పూర్తవగానే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు.