ఒకప్పుడు బాలచందర్ మణిరత్నం భారతీరాజా బాలు మహీంద్రా లాంటి టాప్ దర్శకుల సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూసేవారు. తరాలు మారిపోవడంతో వీరి హవా తెలుగు ప్రేక్షకులలో బాగా తగ్గింది. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా తెలుగు దర్శకులకు తమిళ ఇండస్ట్రీలో డిమాండ్ ఏర్పడటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

 

 మన టాప్ హీరోలు తమ సినిమాల కథల ఎంపిక విషయంలో తెగ కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితులలో చాలామంది తెలుగు దర్శకులు ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి దర్శకులకు కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా మంచి డిమాండ్ ఏర్పడటం సంచలనంగా మారింది. ‘మహర్షి’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి సంవత్సరాల తరబడి టాప్ హీరోల పిలుపు గురించి ఎదురు చూడవలసి వచ్చింది.

 

 
అయితే కోలీవుడ్ టాప్ హీరో విజయ్ వంశీ పైడిపల్లిని పూర్తిగా నమ్మడంతో ‘వారసుడు’ మూవీ తమిళనాట ఆసినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. లేటెస్ట్ గా విడుదలైన వెంకీ అట్లూరి ధనుష్ తో తీసిన ‘సార్’ మూవీ కోలీవుడ్ లో మాత్రమే కాకుండా ఈమూవీ తెలుగు డబ్బింగ్ కూడ సూపర్ హిట్ అయింది. దీనితో వెంకీ అట్లూరి పేరు కోలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది.

 

 
ఇప్పుడు తమిళ హీరోలు కార్తీ సూర్య విజయ్ లాంటి పాపులర్ కోలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా కన్నడ హీరో యష్ కూడ టాలీవుడ్ మార్కెట్ పై కన్ను వేయడంతో ప్రస్తుతం వీరంతా టాలీవుడ్ దర్శకుల వైపు చూస్తున్నట్లు టాక్. త్వరలో శేఖర్ కమ్ముల ధనుష్మూవీ కూడ సెట్స్ పైకి రావచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం చాలామంది తెలుగు దర్శకులు విజయ్ కార్తీ సూర్య లకు కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. మంచి కథతో ఎవరైనా దర్శకుడు వస్తే డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి రజనీకాంత్ విక్రమ్ లాంటి టాప్ హీరోలు ముందుకు వస్తున్నట్లు టాక్. గోపీచంద్ మలినేని బాబి లాంటి హిట్ డైరక్టర్లు కూడ తమిళ హీరోల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: