కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలు విడుదలైనపుడు కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే ఆ పార్టీలు లౌకిక వాద ముసుగులో కొన్ని వర్గాలకు అనుకూలంగా ప్రవర్తిస్తాయనే ఆరోపణలు మొదటి నుంచే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కేరళ స్టోరీ సినిమాను నిషేధించాయి.


ఇలా నిషేధించినప్పటికీ కోర్టులకు వెళ్లి మరీ సినిమా విడుదలకు సంబంధించి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కానీ బెదిరించి మరీ థియేటర్లలో నడవకుండా చేశారు. అయితే కేరళ స్టోరీ సినిమాకు సంబంధించి ఎందుకు కేరళ ఎందుకు నిషేధించలేదు. మత స్వేచ్ఛ గురించి నిషేధించలేదా? లేక సిని స్వేచ్ఛ గురించి ఆలోచన చేసిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఒకప్పుడు ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు. క్రైస్తవ సామాజిక వర్గం కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు.


కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు నుంచి క్రిస్టియన్లు కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తద్వారా క్రిస్టియన్ల ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేసి గెలిపించేది హిందువులే.. ప్రస్తుతం కమ్యూనిస్టులకు ఎక్కువగా మద్దతు తెలుపుతున్నది కూడా అక్కడ హిందువులే అని తేలింది. హిందువులు గుడులకు వెళ్లి పూజలు చేస్తారు. కానీ కమ్యూనిస్టు విధానాలను ఇష్టపడతారు.


కులాల వారీగా కమ్యూనిస్టు నాయకులు బలంగా ఉన్నారు. శబరిమలై వివాదంలో క్రిస్టియన్, ముస్లింల వాదనలకు సంబంధించి కాస్త కమ్యూనిస్టులు అనుకూలంగా ప్రవర్తించినా కేరళ స్టోరీ సినిమా వివాదానికి వచ్చే సరికి మౌనంగా ఉండిపోయారు. కేరళలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రిగా పినరయ్ ఉన్నపుడు ప్రకటించారు. ఏకంగా సీఎం అటువంటి ప్రకటన చేయడంపై అప్పట్లో సంచలనంగా మారింది. ఏదేమైనా కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు రియల్ లైఫ్ లో జరిగిన  సంఘటనల ఆధారంగా తీసినా..  దాన్ని కోర్టుల వరకు వెళితేనే పరిష్కరించుకునే మార్గం కనిపించడం ఇక్కడ ఇబ్బందికరమైన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: