ఈనెల 16వ తారీఖు వరకు చెప్పుకోతగ్గ సినిమాలు ఏమి లేకపోవడంతో ప్రస్తుతం డబ్బింగ్ సినిమాల హవా మాత్రమే కొనసాగుతోంది. ‘బిచ్చగాడు 2’ ’1998’ సినిమాలకు పోటీ ఇవ్వగల తెలుగు సినిమాలు లేకపోవడంతో సినిమాలు వీకెండ్ లో చూడాలి అన్న అభిప్రాయంలో ఉన్న వారికి కేవలం డబ్బింగ్ సినిమాలు మాత్రమే మార్గంగా కనిపిస్తున్నాయి.


ప్రస్తుతం బాక్సాఫీస్ వెలవెల పోతోంది ఇలాంటి పరిస్థితులలో సమ్మర్ రేస్ కు ముగింపు పలుకుతూ విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ మాత్రమే తిరిగి ధియేటర్లకు కళ తెప్పిస్తుంది అన్న అంచనాలతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు నేటితరం ప్రేక్షకులకు నచ్చడంతో ఈ మూవీ ఘన విజయం సాధిస్తుంది అన్న అంచనాలతో ఈ మూవీ బయ్యర్లు ఉన్నారు.


ప్రస్తుత పరిస్థితులలో ఒక మూవీ మ్యానియాను పెంచగల శక్తిమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఉంటుంది. దీనితో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కనీవిని ఎరుగని రీతిలో తిరుపతిలో ఈనెల 6న నిర్వహించబోతున్నారు. ఈ ఫంక్షన్ రోజున విడుదలయ్యే ట్రైలర్ గురించి ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి అన్నడంలో సందేహం లేదు.


రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ లో భారీ యాక్షన్ సీన్స్ హైలెట్ కాబోతున్నాయని టాక్. రామరామణ యుద్ధానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ తో ఈ మూవీ ట్రైలర్ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటివరకు నెగిటివ్ ప్రచారంతో నష్టపోయిన ‘ఆదిపురుష్’ మూవీ ఘన విజయానికి ఈ ట్రైలర్ అత్యంత కీలకం కావడంతో ఈమూవీ ట్రైలర్ ను చాల జాగ్రత్తగా కట్ చేసినట్లు తెలుస్తోంది. మూవీ టాక్ తో సంబంధం లేకుండా ఒక వారం పూర్తి అయ్యే సరికే ‘ఆదిపురుష్’ గ్రాస్ కలక్షన్స్ 1000 కోట్ల స్థాయికి తీసుకురాగలిగితే ప్రభాస్ ఆనందానికి అవధులు ఉండవు..
మరింత సమాచారం తెలుసుకోండి: