సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న  గుంటూరు కారం అనే సినిమా లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ముగిసిన వెంటనే దర్శకతీరుడు రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఉండబోతుంది. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉండబోతున్నాయి అని చెప్పాలి. అయితే రాజమౌళి ఇక హీరోకి తగ్గట్లుగా పాత్రను రాసుకుంటాడు. మరి ఎంతో క్యూట్గా హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ బాబు కోసం ఎలాంటి పాత్రను రాసుకున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రాజమౌళి తన సినిమాలో కాస్టింగ్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాడు అని చెప్పాలి. మొహమాటానికి పోయి ఎవరిని పడితే వారిని సెలెక్ట్ చేయకుండా.. ఆ పాత్రకు సరిగ్గా సెట్ అయితేనే ఇక ఛాన్స్ ఇవ్వడం లాంటిది చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు మూవీ కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీ తో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారట. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా ఇక మహేష్ సినిమాలో కనిపించబోతున్నాడట.


 ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహేష్ బాబును ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఏకంగా బడా స్టార్ ను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాడట రాజమౌళి. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ ను విలన్ గా తీసుకుంటున్నారని బాలీవుడ్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీపికా పదుకొనేని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారట. అమీర్ ఖాన్ విలన్ అన్న వార్త నిజమైతే మాత్రం ఇక మహేష్ సినిమా అరాచకమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: