‘అత్తారింటికి దారేది’ తరువాత పవన్ మరదలుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న కన్నడ బ్యూటీ ప్రణీత ఆ తరువాత అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించినా పెద్దగా రాణించలేదు. దీనితో ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ మ్యాగజైన్లకు ఫోటో షూట్స్ ఇచ్చుకుంటూ మధ్యమధ్యలో ఎవరైనా షో రూమ్ ల ఓపెనింగ్ లకు పిలిస్తే అక్కడికి వెళుతూ తన సందడిని కొనసాగిస్తోంది. 


ఇలాంటి పరిస్థితులలో ఈరోజు జరుగుతున్న ‘జనతా కర్ఫ్యూ’ పై ఆమె చేసిన కామెంట్స్ భారతీయ జనతా పార్టీ ప్రధాన అస్త్రం అయిన హిందూ మత తత్వ ధోరణిలో ఉండటంతో ఇక రానున్న రోజులలో ప్రణీత భారతీయ జనతా పార్టీలో చేరి తన మనుగడను రాజకీయ నాయకురాలుగా కొనసాగిస్తుందా అన్న సందేహాలు కలగడం సహజం. ప్రస్తుతం ప్రపంచం అంతా హిందు మతం వైపు చూస్తోందని మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే చేతులతో నమస్కారం చేయడం ఇంట్లోకి వెళ్లేముందు చేతులు కాళ్ళు కడుక్కోవడం లాంటి పద్దతులను అనుసరిస్తూ ఈరోజు ప్రపంచం తమకు తెలియకుండానే భారతీయ సంస్కృతిని ప్రమోట్ చేస్తోంది అంటూ ప్రణీత అభిప్రాయ పడుతోంది.  


ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ హిందూ మతం ఒక మతం కాదని అది ఒక సాంప్రదాయం అనీ ఆమె కామెంట్ చేసింది. పాశ్చాత్య సంస్కృతి మోజులో మ‌న సంస్కృతి సంప్ర‌దాయాలను విస్మ‌రిస్తూ స‌రికొత్త రోగాల‌ను తెచ్చుకుంటున్నామని ఆమె వివరిస్తూ మన పెద్దలను చెప్పిన మార్గాలను అనుసరిస్తే ఎవరికీ ఎటువంటి అనారోగ్యాలు ఉండవు అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేస్తోంది. 


ఇప్పుడు ఆమె చెప్పిన అభిప్రాయాలు ఈరోజు జరుగుతున్న జనతా కర్ఫ్యూ సందర్భంగా మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా ఈ విధంగా జనతా కర్ఫ్యూ రోజున ప్రణీత వ్యూహాత్మకంగా తన ఇమేజ్ పెంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ప్రణీత ను రానున్న రోజులలో రాజకీయ నాయకురాలుగా చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: