వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  అక్కినేని నాగార్జున హీరో వ‌చ్చిన `శివ` సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారిన రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆ త‌ర్మాత ఎన్నో సినిమాలు చేసి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌ర్చుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం సినిమాల సందడి తగ్గి ఇతర హడావుడి ఎక్కువగా చేస్తున్నాడు ఈయ‌న‌. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వర్మకు అలవాటే. ఎవ్వరు ఎలా రియాక్ట్ అయినా ఫర్వాలేదు తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ.

 

అయితే ఈయ‌న ఎపుడు ఎవరిపై ఏ రకంగా స్పందిస్తాడనేది చెప్పడం కాస్తంత కష్టమే అని చెప్పాలి. కానీ, ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా సెటైర్లు వేయ్యాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఎపుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. ఇక హీరోల‌కు వైవిధ్య పాత్ర‌లు, హీరోయిన్ల‌కు రొమాంటిక్ పాత్ర‌లు ఇచ్చి సంచ‌నాల‌ను సృష్టించే వ‌ర్మ‌.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాడు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. వాస్త‌వానికి యాక్షన్ చెబుతూ హీరోయిన్ ను డైరెక్ట్ చేసే దర్శకులు ఎప్పుడు లవ్ లోకి దింపుతారో గాని సడన్ గా పెళ్లిచేసుకోవ‌డ‌మో.. లేదా వాళ్ల‌తో ప్రేమాయ‌ణం న‌డప‌డ‌మో చేస్తుంటారు.

 

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆ విధంగా ఒకటైన వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు మ‌ధ్య‌లోనే విడిపోయిన వారు ఉన్నారు. మ‌రికొంత‌మంది పెళ్లి చేసుకుని.. లైఫ్‌ను హ్యాపీగా ర‌న్ చేస్తున్న‌వారు ఉన్నాయి. మ‌రి వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఏమ‌న్నా ప్రేమ వ్య‌వ‌హారాలు ఉన్నాయా అంటే.. వర్మ తనతో కలిసి పలు చిత్రాల్లో పని చేసిన ఉర్మిలా, నిషా కొటారి, ఆంత్రమాలిని, మధుశాలిని లాంటి వారితో ప్రేమాయణం నడిపారనే పుకార్లు గ‌తంలో చాలానే వినిపించాయ‌ని చెప్పాలి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో వ‌ర్మ‌కే తెలియాలి.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: