
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మళ్లీ తిరిగి పెద్ది కోసం టాలీవుడ్ కు వచ్చేసింది .. ప్రస్తుతం హైదరాబాద్ లో అడుగు పెట్టింది .. రామ్ చరణ్ తో కలిసి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతుంది .. మొన్నటి వరకు ఆమె కాన్స్ చిత్రోత్సవం లో మెరుపులు మెరిపించింది .. ఆ తర్వాత ముంబై కి వచ్చి తన కొత్త సినిమా ప్రచార కార్యక్రమా ల్లో పాల్గొంది .. ఇప్పుడు వాటి ని ముగించుకుని ఇప్పుడు పెద్ది సినిమా షూటింగ్లో అడుగు పెట్టేసింది .. టాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఇది రెండో సినిమా .. ఎన్టీఆర్ హీరో గా వచ్చిన దేవర సినిమా తో ఈమె తెలుగు లో అడుగు పెట్టింది ..
ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి నటిస్తుంది .. బుచ్చిబాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా కు సంబంధించి ఇప్పటి కే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసింది జాన్వీ కపూర్ .. ఇప్పుడు మరోసారి ఈ సినిమా కోసం భారీగా కాల్ షీట్లు కేటాయించింది .. ఇది కూడా పెద్ద షెడ్యూలే .. వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ , మైత్రి మూవీ మేకర్స్ సంయుతం గా నిర్మిస్తున్న ఈ సినిమా కు స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు .. వచ్చే ఏడాది మార్చ్ 27 న పెద్ది మూవీ ప్రేక్షకుల ముందు కు రాబోతుంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ...