మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా రవితేజ కు సంబంధించిన సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నట్టు ప్రకటనలు రావడం , ఆ తర్వాత ఆగిపోవడం జరుగుతూ వస్తుంది. ఆఖరుగా రవితేజ నటించిన క్రాక్ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సంక్రాంతి పండక్కు రవితేజ నటించిన ఏ సినిమా కూడా విడుదల కాలేదు.

మొదట రవితేజ నటించిన ఈగల్ మూవీ ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ సంక్రాంతి భరి నుండి తప్పుకుంది. ఆ తర్వాత మాస్ జాతర మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కూడా ఆ తర్వాత సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇకపోతే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు వార్తలు బలంగా వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను తాజాగా స్టార్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ను అత్యంత వేగంగా పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అదే స్పీడ్ లో కంప్లీట్ చేసి ఈ మూవీ ని కచ్చితంగా సంక్రాంతి బరిలో నిలపాలి అని మేకర్స్ అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఇక మేకర్స్ ప్లానింగ్ చూస్తూ ఉంటే ఈ సారి రవితేజ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనపడుతున్నాయి. దీనితో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: