అనంతక, రవితేజ, సుమంత్ నిట్టూర్కర్  నటీనటులుగా..డైరెక్టర్ ఫణీంద్ర దర్శకత్వంలో వచ్చిన 8వసంతాలు సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా చాలా ఎమోషనల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ కూడా ఒక ప్రేమ కథ స్టోరీ అన్నట్లుగా ట్రైలర్లో చూపించారు. మరి ఈ ప్రేమ కథ ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే..
శుద్ధి అయోధ్య (అనంతిక) తన పని పట్ల చాలా అంకితభావంతో ఉంటూ ఏదైనా సాధించగలిగే యువతిగా ఉంటుంది.. అలాగే రచయిత్రి కూడా.. ఎవరైనా తనతో బరిలోకి దిగితే మాత్రం వారిని కింద పడగొట్టేలా మార్షల్ ఆర్ట్స్, బ్లాక్ బెల్ట్ లో ఆరితేరిన వ్యక్తి. అలాంటి శుద్ధి జీవితంలోకి వరుణ్ (హాను రెడ్డి) వచ్చి ఆమె దారిని మార్చేస్తారు?. అప్పటివరకు శుద్ధి బతుకుతున్న ప్రపంచానికి ప్రేమను పరిచయం చేస్తారు చివరకు వారు తన స్వార్ధాన్ని చూపించుకొని శుద్ధిని వదిలేసి వెళ్తారు వరుణ్.. ఆ తర్వాత శుద్ధి ఏం చేస్తుంది ? సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్ర ఏమిటి అసలు 8 వసంతాలలో జరిగిన మార్పు ఏంటన్నది సినిమా కథ.


8 వసంతాలు అనే టైటిల్ చూస్తేనే ఈ సినిమాకి పాజిటివ్  వైబ్ కనపరిచింది. డైరెక్టర్ ఫణీంద్ర ఈ సినిమాలో తన నాలెడ్జిని మొత్తం ఉపయోగించారు. అందుకే ప్రతి డైలాగు ప్రతి సన్నివేశం కూడా సినిమాలో తన భావాన్ని అనుభవాన్ని చూపించారు. డైరెక్టర్ కొన్ని సన్నివేశాలను బాగానే డీల్ చేసిన మరికొన్ని సన్నివేశాలు సీరియల్ కంటే చాలా దారుణంగా సాగదీశారని బోరింగుగా అనిపించాయని తెలియజేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే డైలాగ్ చాలా గొప్పగా అనిపిస్తుంది."నేను కాదని అనుకుంటే.. నా చున్నీ కూడా నిన్ను తాకదు తాకనివ్వను "అంటూ డైలాగ్ హైలైట్ గా ఉన్నది.



మొదటి భాగంలో కాస్త ఆసక్తికరంగా ఎక్సైటింగ్ గా ఆహ్లాదకరంగా కొనసాగుతున్న ప్రేమ సన్నివేశాలు, బిజిఎం కూడా బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంటర్వెల్ లో కాస్త ఎమోషనల్ గా పరిచయం చేశారు డైరెక్టర్. కానీ సెకండాఫ్ లోని సినిమా గాడి తప్పినట్టుగా కనిపిస్తోందట. అంతవరకు సాఫీగా సాగే సినిమా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరంగా చూపించలేకపోయారు.. అమ్మ కోసం త్యాగం చేసేటువంటి కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి ప్రోటీన్ గా కనిపించే సన్నివేశాలతో పాటు కొన్ని షార్ట్ ఫిలింలో కనిపించడమే మైనస్ గా ఉందట. అలాగే కొన్ని డైలాగులు కూడా సాగదీతగా ఉన్నాయి.

కాశ్మీర్ అందాలు, ఊటీ అందాలను, తెరమీద చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా చూపించారు . సినిమా ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అన్ని టెక్నాలజీ కూడా ప్లస్సుగా ఉన్నాయి.

ఆర్టిస్టుల విషయానికి వస్తే అనంతిక అద్భుతంగా నటించిందని.. ఆమె అందం డైలాగులు ఈ సినిమాకి ప్లస్ గా మారాయి. ఇక సెకండ్ హాఫ్ లో రవి దుగ్గిరాల నటించిన తీరు అద్భుతంగా ఉన్నది.. హను రెడ్డి యాక్టింగ్ కూడా అద్భుతంగానే ఉన్నది. మరి పూర్తి రివ్యూ మరికొన్ని గంటలలో రాబోతోంది.

ప్లస్:
సినిమాలోని మ్యూజిక్, డైలాగ్, హీరోయిన్ ఆనంతిక నటన, ఫస్టాఫ్

మైనస్:
అక్కడక్కడ కొన్ని స్లో సన్నివేశాలు, సెకండాఫ్, చివరిలో క్లైమాక్స్.

రేటింగ్:2.25/5

మరింత సమాచారం తెలుసుకోండి: