అవును, మీరు విన్నది నిజమే. సోషల్ మీడియా మార్కెట్లో ఇపుడు స్కామ్‌లకి కొదువేముంది. తెలిసిందే కదా... అధునాత‌న‌ ప్ర‌పంచంలో కల్తీల‌కు, కాపీల‌కు అయితే అస్సలు అంతే లేకుండా పోతోంది. అచ్చం ఒరిజిన‌ల్ బ్రాండ్ ని త‌ల‌పించే మ‌రో డూప్లికేట్ బ్రాండ్లు క్షణాల్లో మార్కెట్లోకి దర్శనమిస్తున్నాయి. సెల్ ఫోన్ నుండి అప్లికేషన్స్ వరకు మనం రెగ్యుల‌ర్‌గా చూస్తున్న‌వే. ఈ క్రమంలో కేటుగాళ్లకు అదుపు లేకుండా పోతుంది. ఇన్ స్టాలు, ఫేస్ బుక్ ల‌లో ఫేక్ ఐడీల‌తో దండిగా సంపాదించే ప్ర‌బుద్ధులు ఎంతోమంది ఉన్నారు. అవును, ఇపుడు అన్ని రంగాల్లోనే ఫేక్ లు రాజ్య‌మేలుతున్నాయి అని చెప్పుకోవచ్చు.

ఇంచుమించు అలాంటి కాపీ స్కామే ఒకటి బయటపడింది. అయితే దీనిని కాపీ అనాలో క‌ల్తీ అనాలో అర్థం కావడం లేదని నిపుణులు జుట్టు పీక్కుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ స్థానంలో జెట్ ఫ్లిక్స్ ని పాపుల‌ర్ చేసి ఏకంగా 40 కోట్లు పైగా సంపాదించేశాడ‌ట ఓ కేటుగాడు. చివ‌రికి ఓటీటీల‌కు కూడా గండికొడుతున్నారు నయా మోసగాళ్లు. వివ‌రాల్లోకి వెళితే... నెట్‌ఫ్లిక్స్ త‌ర‌హాలో చట్టవిరుద్ధమైన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జెట్‌ఫ్లిక్స్‌ని సృష్టించి వినియోగ‌దారుల నుంచి డ‌బ్బు సంపాదించిన‌ 5 మంది వ్యక్తులు అమెరిక‌న్ కోర్టులో దోషులుగా నిర్ధారించబడ్డారు. డగ్లస్ కోర్సన్, క్రిస్టోఫర్ డాల్‌మాన్, ఫెలిపే గార్సియా, జారెడ్ జౌరేకీ , పీటర్ హుబెర్ లాస్ వేగాస్‌లో కాపీరైట్ ఉల్లంఘన సంబంధిత నేరాల‌కు పాల్పడ్డారు.

వీరి ఇప్పటికే మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారని వినికిడి. కేవ‌లం నెలవారీ రుసుము కేవ‌లం 9.99 డాల‌ర్ల‌తో 10వేల సినిమాలు, 1,83,000 టీవీ ఎపిసోడ్‌లు అందించ‌డం ఈ స్కీమ్ లో బయటపడింది. స్కామ్ లో ఇప్పుడు జెట్ ఫ్లిక్స్ దిగ్గ‌జ ఓటీటీల‌నే త‌ల‌ద‌న్నిందంటే అర్ధం చేసుకోండి. నెట్‌ఫ్లిక్స్, హులు, వుడు మరియు అమెజాన్ ప్రైమ్ కంటే పెద్ద లైబ్రరీని జెట్ ఫ్లిక్స్ సేకరించిందని సమాచారం. ఇక పైరేట్ వెబ్‌సైట్‌ల బెడ‌ద‌తో భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ఏటేటా వంద‌ల కోట్లు నష్టపోతున్న విషయం తెలిసినదే. ఇది కూడా అలాంటి స్కామ్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. త‌మిళ రాక‌ర్స్ టొరెంట్ మాదిరిగానే ఒరిజిన‌ల్ ఓటీటీల నుంచి ఎపిసోడ్స్ ని నిమిషాల్లోనే కాపీ చేసి జెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసేస్తోంది. కాబట్టి మిత్రులారా మీరు కూడా నెట్‌ఫ్లిక్స్ కి బదులు జెట్ ఫ్లిక్స్ లో రిజిస్టర్ అయితే జర జాగ్రత్త!

మరింత సమాచారం తెలుసుకోండి: