
కాబట్టి ముందుగా యూరప్ దేశాలను టార్గెట్ చేసి అణు విధ్వంసం చేయడానికి రష్యా వెనకాడదని వెల్లడించారు. అమెరికా దూరంగా ఉంటుంది. కాబట్టి దానికి వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ రష్యా కు దగ్గరగా ఉన్న నాటో దేశాలకు ఇప్పుడు అసలైన సమస్య వచ్చి పడింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో ఎక్కువగా ఉక్రెయిన్ కు ఆయుధాలను ఎక్కువగా ఇచ్చింది బ్రిటన్ దేశం. అలాంటపుడు పుతిన్ ఎందుకు బ్రిటన్ ను టార్గెట్ చేయడని అనుకుంటున్నారు. కచ్చితంగా బ్రిటన్, నాటో దేశాలపై అణు బాంబులు వేయకుండా వదిలిపెట్టడు. యుద్దానికి చెక్ పెట్టకపోతే రష్యా తీసుకోబోయే నిర్ణయాలకు అందరూ బలి కావాల్సి వచ్చేలా ఉంది. యుద్ధం చేయడం వరకు ఓకే కానీ దాని ముగింపు మాత్రం భయానకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఒక వేళ రష్యా వెనకడుగు వేసే సమయం వస్తే మాత్రం ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువగా అణ్వయుధాలు వారి వద్దనే ఉన్నాయి. ఏ మాత్రం ఆలోచించకుండా నాటో దేశాలపై ముందు అది ఎటాకింగ్ చేస్తుంది. తర్వాత తాము ఏమైపోయినా పర్లేదు అనుకుంటాయి. బ్రిటన్ సైనికాధికారి ఇలా మాట్లాడటానికి కారణం ఉంది. యుద్దం ప్రారంభమై 16 నెలలు కావొస్తుంది. ఇప్పటికే రెండు దేశాల సైనికులు ఎంతో మంది చనిపోయారు. నాటో దేశాలు, అమెరికా కలిసి ఆయుధాలు ఉక్రెయిన్ కు ఇస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో రష్యా తీరును కచ్చితంగా గమనిస్తూ ఉండాలనుకుంటున్నారు.