
దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు కలుపుకుంటే మొత్తం రూ. 65 వేల కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 18 సంవత్సరాల నుంచి పై బడిన మహిళలకు డబ్బులు అందజేత, జిల్లాల్లో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం, నిరుద్యోగ భృతి, ఇలా చంద్రబాబు చెబుతున్న పథకాలన్నింటికీ కలిపి రూ. 65 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ఆదాయం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చేవి దాదాపు 65 వేల కోట్ల వరకు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో 65 వేల కోట్ల రూపాయలు ఉచిత పథకాలకు పోతే.. సంక్షేమం ఎలా రోడ్ల నిర్మాణం, భవనాలు, నీటి పారుదల రంగం, వైద్యం, తదితర ప్రాముఖ్య రంగాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు. ముఖ్యంగా అమరావతి రాజధానిని హైదరాబాద్ నగరం కంటే ఎక్కువగా డెవలప్ చేస్తానని చెబుతున్నారు.
రాష్ట్ర ఆదాయం కాస్త ఉచిత పథకాలకు, గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలకు పోతే ఏ విధంగా అమరావతని డెవలప్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ విశాఖ పట్నం రాజధానిగా ఉంటే దాన్ని డెవలప్ చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని, కానీ అమరావతి రాజధానిగా విశ్వ నగరంగా చేయాలంటే మాత్రం అది అంత ఈజీ కాదని అంటున్నారు. మరి చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలు మాత్రం కచ్చితంగా పథకాలు ఏవని ప్రశ్నిస్తారు.