
అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న పదవులను త్వరితగతిన భర్తీ చెయ్యాలని విజయసాయి రెడ్డి సూచించారు. గతంలో పార్డీ నిర్వహించిన జయహో బీసీ సమావేశం మాదిరిగా ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటీ సమావేశాలు రాష్ట్ర స్ధాయీలో నిర్వహించాలని విజయసాయి రెడ్డి చెప్పారు. అనేక సామాజిక వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలపై ప్రచారం పెంచాలన్నారు.
దీనిపై ఇంటింటికీ ప్రచారం ఎలా చెయ్యాలి అన్నదాని మీద విజయసాయి రెడ్డి పార్టీ నేతలతో చర్చించారు. అనుబంధ విభాగాల అధ్యక్షులకు అధనంగా మరికొంత మందిని నియామించే అంశంపైనా విజయసాయి రెడ్డి చర్చించారు. దీనిపై సాధ్యాసాధ్యాలపై విజయసాయి రెడ్డిఈ సమావేశంలో చర్చలు జరిపారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పని చేశాయో విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.
అదే తరహాలో మరోసారి 2024 గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. త్వరగా పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇంచార్జీలు, జిల్లా ప్రెసిడెంట్స్, మండల ఇంచార్జిల ఖాళీలను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జయహో బిసి మహాసభ తరహాలో త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ,ముస్లిం మైనారిటీ, మహాసభలు విజయవంతం చేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు తన దృష్టికి తీసుకురావాలని విజయసాయి రెడ్డి పార్టీ నేతలను కోరారు. మొత్తం మీద కొన్నాళ్లుగా పార్టీలో కనిపించని విజయసాయి రెడ్డి మరోసారి యాక్టివ్ అయ్యారు.