భారత్లో అపర కుబేరుడిగా  కొనసాగుతున్న ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యుల జీవనశైలి ఎప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న విషయాల్లో ఇక అంబానీ కుటుంబం పెట్టే ఖర్చు.. ఏకంగా వారి కింద పని చేసే వారికి జీతాలు కూడా అందరిని నోరేళ్లపెట్టేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ముఖేష్ అంబానీ భార్య నీత అంబానీ ఎప్పుడు ఎంతో ఖరీదైన దగదగా మెరిసిపోయే దుస్తువులు ధరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక మంచి మేకప్ వేసుకొని ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది.



 ముకేశ్ అంబానీ కుటుంబం ఎక్కడికి వెళ్ళినా నీత అంబానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా నీతో అంబానికి గ్లామరస్ లుక్ ఇచ్చే మేకప్ ఆర్టిస్ట్ పేరు మిక్కీ కాంట్రాక్టర్. ఇక ఎప్పుడూ మిక్కీ కాంట్రాక్టర్ నీత అంబానికి మేకప్  పని చేస్తూ ఉంటారట. ఇప్పటివరకు ఎన్నో రకరకాల ఈవెంట్లకు వెళ్లిన నీతా అంబానీ ఎంతో అందంగా హీరోయిన్ లా కనిపించడానికి వెనుక ఇక మిక్కీ కాంట్రాక్టర్ మాయాజాలమే ఉంది అన్నది తెలుస్తుంది. ఆకాష్ అంబానీ - శ్లోకా మెహతా వివాహం సమయంలో... అంబానీ కుమార్తె కుమార్తె ఈశ అంబానీల వివాహం కి కూడా నీత అంబానికి మేకప్ చేసింది మిక్కీ కాంట్రాక్టరేనట.



 అయితే కేవలం నీతా అంబానికి మాత్రమే కాదు.. ఎంతోమంది బాలీవుడ్ నటీమణుల ఫేవరెట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా మిక్కీ కాంట్రాక్టర్ అని తెలుస్తుంది. కాజోల్ నుంచి ఆలియా భట్ వరకు చాలామంది నటి మణులకు మిక్కీ కాంట్రాక్టర్ ఇప్పటివరకు మేకప్ చేశాడు. అయితే ఇలా మేకప్ వేయడం కోసం ఒక్కొక్కరికి ఏకంగా 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు చార్జ్ చేస్తాడట మిక్కి కాంట్రాక్టర్. అయితే ఇక సినీ ఇండస్ట్రీలో మిక్కీ ఒక ఖరీదైన మేకప్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. నెలకు కోట్లలోనే అతను సంపాదిస్తాడట. ఒకరకంగా చెప్పాలి అంటే మిక్కీ కాంట్రాక్టర్ నెల సంపాదన అటుఒక కంపెనీ సీఈవో వేతనం కంటే ఎక్కువే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: