నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ సినిమా మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగు ను ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైటిల్ ను రేపు మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు.

ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేర్ వీరయ్య అనే మూవీ కి దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాబీ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ సంవత్సరం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10 వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కోన వెంకట్ కథను అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నట్లు ... ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా జూన్ 10 వ తేదీన బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: