భారత్ లో కొత్త వైరస్ నోరో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అమెరికా శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పులు లాంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరా వ్యాపిస్తుంది. అయితే ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తోంది.

కేరళలో నోరో వైరస్ కేసులు నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది అంటువ్యాధి అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తాగునీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని.. చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేరళలో 2వారాల వ్యవధిలో 13మంది ఈ వైరస్ సోకింది. వీరందరూ వయనాడ్ జిల్లాలో ఓ పశువైద్య కళాశాల విద్యార్థులని సమాచారం.

పలు దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆ ముప్పు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదముందని హెచ్చరిస్తున్న నిపుణులు.. 18ఏళ్లు పైబడిన వారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ సెకండ్ డోస్ గడువు ముగిసినా.. చాలామంది వేసుకోలేదు. ఇక 85శాతం మంది మాస్కులే ధరించడం లేదు. మనందరినీ కన్నీళ్లు పెట్టించిన కరోనా రోజులు మళ్లీ రావొద్దంటే వ్యాక్సిన్, మాస్క్ తప్పనిసరి.

ఇక మన దేశంలో గత 24గంటల్లో 11వేల 850మంది కరోనా బారిన పడ్డారు. 555మంది కొవిడ్ తో మరణించారు. తాజాగా 12వేల 403మంది రికవరీ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3కోట్ల 38లక్షల 26వేల 483కు చేరింది. మరోవైపు ప్రస్తుతం దేశంలో లక్షా 36వేల 308యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 111.40కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్లక్ష్యంగా వహించొద్దని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: