
ముఖ్యంగా పోలీసులు ఎక్స్చేంజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను కూడా మూసివేయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారంలో మద్యం దుకాణాలు మూతపడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్ లో ఉండేటువంటి మద్యం కళ్ళు దుకాణాలు, అలాగే బార్లు మూసివేయబోతున్నట్లు సిపిసివి ఆనంద్ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండేటువంటి నార్త్, ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలో ఉండే వైన్ షాపులను కూడా మూసివేయబోతున్నట్లు తెలియజేశారు.
అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం సెంట్రల్ జోన్లో ఉండే గాంధీనగర్, ఈస్ట్ జోన్ లో ఉండే చిలకలుగూడ, అలాగే వారాసిగూడ, లాలాగూడా, నార్త్ జోన్ లో బేగంపేట పరిధిలో ఉండేటువంటి షాపులు తుకారం గేట్, మారేడుపల్లి, మహంకాళి ఏరియా, తదితర ప్రాంతాలలో ఉండే మద్యం కళ్ళు దుకాణాలతో పాటుగా బార్లను సైతం ఈనెల 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మూతపడునున్నాయట. ఎందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రెండు రోజులపాటు వైన్ షాప్ లో బంద్ కాబోతున్నాయి.