
అలాంటి ధోనిపై ఇటీవలే మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో జరిగిన విషయాలను ఇటీవల చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ టై గా ముగియడంతో విజేతలను నిర్ణయించేందుకు బాల్ అవుట్ ని ఎంచుకున్నారు ఎంపైర్లు. ఫుట్బాల్లో షూట్ అవుట్ మాదిరిగానే క్రికెట్లో బాల్ అవుట్ ఉంటుంది. ఇరుజట్ల నుంచి ఐదుగురు బౌలర్లు బంతివేసి వికెట్లను గిరాటేయాల్సి ఉంటుంది.
టీమ్ ఇండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్, హార్భజన్ సింగ్, ఉత్తప్ప మొదటి మూడు ప్రయత్నాల్లోనే వికెట్లను పడగొట్టగా.. పాకిస్తాన్ బౌలర్లు ముగ్గురు కూడా మిస్ చేశారు. దీంతో టీమిండియా కు 3-0 తేడాతో విజయం దక్కింది. అయితే ఇక ఇలా బాల్ అవుట్ సమయంలో తానే ధోని దగ్గరికి వెళ్లి నేనే మొదట వేస్తానని చెప్పాను. కచ్చితంగా వికెట్లను పడగొట్టగలనని నమ్మకం ఉందని చెప్పాను. అంతే కాదు బౌలర్లకు ఇవ్వొద్దని కూడా చెప్పాను. నా సలహాకి ధోని కూడా షాక్ అయ్యాడు. ఎందుకు బౌలర్లకు ఇవ్వొద్దని అడిగాడు.. రన్ అప్ లో వాళ్ళు వికెట్ సరిగ్గా చూడలేరూ. కచ్చితంగా మిస్ అవుతారు. వార్మప్ మ్యాచ్లో ప్రాక్టీస్ సెషన్స్ లో చాలాసార్లు ఇలా జరిగింది అంటూ వివరించా. ధోని కూడా సరే అన్నాడు. అందుకే రెగ్యులర్ బౌలర్లను కాకుండా ఇక బ్యాట్స్మెన్లు బౌలింగ్ వచ్చి ఇక టీమిండియా కు విజయం అందించాము. అది నా ఆలోచనే అంటూ చెప్పుకోచాడు వీరేంద్ర సెహ్వాగ్.