
ముఖ్యంగా కోహ్లీ నుంచి కెప్టెన్సీ అందుకున్న తర్వాత రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలో మునిగిపోయాడేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అతను ఆడిన చెప్పుకుదగ్గ ఇన్నింగ్స్ ల గురించి వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో వైఫల్యాన్ని కొనసాగించిన రోహిత్ శర్మ ఇప్పుడు కీలకమైన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లోను అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ అయ్యుండి ఆచితూచి ఆడుతూ ఇక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెట్టాల్సింది పోయి.. 15 పరుగులకే వికెట్ చేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే కీలకమైన మ్యాచ్లో రోహిత్ చేతులెత్తేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.
అయితే ఇక ఇటీవలే జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో.. ఇక గత ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో అతని ప్రదర్శన గురించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ పేలవ ప్రదర్శన ఎలా ఉంది అనే విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. రోహిత్ శర్మ ఇప్పుడు వరకు 16 ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం రెండు మ్యాచ్లలోనే 50 ప్లస్ రన్స్ చేశాడు. అవి కూడా బలహీనమైన బంగ్లాదేశ్ టీం పై టీ20 ఫార్మాట్లో కావడం గమనార్హం. దీన్ని బట్టి రోహిత్ శర్మ ఎప్పుడు జట్టుకు అవసరమైనప్పుడు తన బ్యాట్ జులిపించలేదు అన్నది మాత్రం అర్థం అవుతుంది.